ఉద్యోగ ధర్మం
పూర్వం ఉద్యోగం పురుష లక్షణం అని అనేవారు. ఇప్పుడు స్త్రీ పురుషులబేధం లేకుండా అందరూ
ఉద్యోగం చేస్తున్నారు.
ఏఉద్యోగి అయినా విధులునిర్వర్తించే సమయంలోబాధలు, అవమానాలు
ఎదుర్కొంటూ ఉంటారు.
ఈ రోజుల్లో ఉద్యోగం చేయటంఅనేది కత్తి మీద సాములా ఉంటోంది. ఈ పోటీ ప్రపంచంలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా సరిపడినన్ని ఉద్యోగాలులేవు.
నిరుద్యోగ యువత ఉద్యోగాలు సంపాందించటంకోసం నానా బాధలు పడుతూఉన్నారు. ఒకవేళ ఉద్యోగం
వచ్చినా కూడా వారికి చాలాఉద్యోగ బాధ్యతలు అనేవి ఉంటున్నాయి.
మేనేజ్మెంట్వారికి టార్గెట్ పెట్టి పనులుచేయమంటున్నారు. ఒకోసారిఆ లక్ష్యం చేరుకోలేని ఉద్యోగికి
అవమానాలు జరుగుతూ ఉంటాయి.
పనులు పూర్తిచేసే క్రమంలో చాలా బాధలుపడుతూ ఉంటారు. అలాబాధపడుతున్న ఉద్యోగికిమరింత పనివత్తిడి కలిగిమానసికంగా నలిగిపోతూఉన్నారు.
మరి ఈ బాధలు,అవమానాలు ఇలా ఎదుర్కోవలసిందేనా అనే సందేహంఅందరిలో ఉంది. నేను గతముఫై మూడు ఏళ్ళుగా ఏదోఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాను.
నేను గమనించిన విషయంఏమిటంటే ఏ పనైనా కష్టంఅని భావిస్తే అది చేయలేము.ఒక బాధ్యతగా ఆ పనిని మనభుజాలపైకి ఎత్తుకోవాలి.
మనపనితనాన్ని విమర్శించేవారుఅన్నిచోట్లా ఉంటారు. వారిపైకోపం తెచ్చుకుని లాభం లేదు.
మన పనితనాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి.
ప్రతిభ ఉన్నవారికి ఆలశ్యం అయినా చక్కని అవకాశాలువస్తాయి. ఇంకొక విషయంఏమిటంటే మనల్ని విమర్శించేవారి వల్ల మనకు ఉపయోగంఉంది.
మన తప్పు ఏమిటోమనకు తెలుస్తుంది. అప్పుడుఆ తప్పును మనం మళ్ళీచేయకుండా చూసుకోవాలి.
అవమానాలని పర్శనల్ గాతీసుకోకూడదు.
అది ఉద్యోగధర్మంలో భాగంగానే తీసుకునిముందడుగు వేయాలి. మనపై అధికారులను మనకు పని
నేర్పించే గురువులుగా భావిస్తేమనసు ప్రశాంతంగా ఉంటుంది.
అలా కాకుండావారిని శతృవులుగా భావిస్తే మనం మరింత ఇబ్బందులుపడవలసి వస్తుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని