ఉదయం
తెలవారే వెలుగుల్లో
జగతేమో మెరిసేను
కలతీరే సమయంలో
సంబరమే ముసిరేను
ఉదయమే నినుతలచింది
నానీడవు నువ్వంటూ
ఊపిరిగా నిలిచింది
నీ ఊహను విడనంటూ
శ్రుతిచేస్తూ మనసేమో
నీ మోమును వెతికింది
పదమేమో పాడింది
పలుకేమో కులికింది
పురివిప్పిన పుడమేమో
నగరాన్ని నిమిరింది
కాఫీల గమకాలే
కానుకలే మనకింక
– సి.యస్.రాంబాబు