త్రివర్ణం

త్రివర్ణం

దివినుండి భువికి దిగివచ్చిన ధ్రువతారలో
నిరంతరం ప్రకాశించే సూర్యచంద్రులో

ఏ కఠోర శ్రమలో
ఈ మట్టిలో వెలసిన పరిమళాలో
దేవుడు పంపిన ఆయుధాలో

ఉద్యమ వీరులో
ఉదయ కిరణాలో
భారత మాత ముద్దు బిడ్డలో
భారత మాత ఉక్కు పిడికిళ్లో

మహనీయులో
త్యాగమూర్తులో
సామాన్యులో
అనితర సాధ్యులో
పోరాట వీరులో
గెలుపు బాటలో

దేశం కోసం
దేశ స్వాతంత్య్రం కోసం
స్వతంత్ర పోరాటంలో
పోరాడి రక్తం చిందించి

అశువులు బాసి తెల్ల దొరల నుండి విముక్తి కల్పించి దేశానికి స్వాత్రంత్ర్యాన్ని అందించారు
దేశ నడిబొడ్డున ఎర్రకోట పై త్రివర్ణ పతాకమై ఎగిరారు

భూగోళమంతా చరిత వినిపించేలా ధ్వనింపచేశారు
విశ్వమంతా విజయాన్ని ఎలుగెత్తి చాటారు

ప్రాణాలను పనంగాపెట్టి రక్తాన్ని ధారపోసి
హింసను పాతిపెట్టి అహింసను బయటకు తీసి స్వతంత్రాన్ని సాధించారు త్రివర్ణ జెండాను ఎగరవేశారు ప్రతి భారతీయుని గుండెలో కొలువై ఉన్నారు

ఏడుపదులు దాటిన పండుగ
దేశమంతా వేడుకై మెరువగా
నేల నేలంతా త్రివర్ణమై మురిసింది

ఈ స్వాతంత్య్రం…
ఎందరో వీరుల త్యాగ ఫలం
మనం కలలుకన్న భారతం
ఈ వజ్రోత్సవ భారతం ఈ త్రివర్ణ పతాకం

– రహీంపాషా యం.డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *