త్రాగునీరు
పంచభూతములలో ఒకటి అయిన నీళ్లు సమస్త ప్రాణికోటికి ఆధార భూతమై ఈ ప్రపంచం మనుగడ సాగిస్తూ మానవాళికి అవసరమైన ఎన్నో సదుపాయాలను సమకూరుస్తూ సమస్త జీవరాసుల దాహం తీరుస్తూ ఉంటే ఆ నీళ్ల విలువ తెలియక అవసరానికి మించిన నీళ్లు వాడుతూ పారపోస్తూ ఉంటారు..!!
మన పెద్దలు నీళ్లకు డబ్బుకు ముడి పెట్టి సామెత చెప్పారు.నీళ్లు ఎక్కువ ఖర్చు పెడితే డబ్బు అంత ఖర్చయిపోతుంది. అధికం నీళ్లు నేలపాలు చేస్తే డబ్బు కూడా నీటి లాగానే నిలవకుండా వెళ్ళిపోతుంది .కాబట్టి నీటిని పొదుపుగా వాడుకుంటేనే డబ్బు నిలుస్తుంది అంటారు.
పట్టణాలల్లో ఉండే వాళ్లకు సౌకర్యాలు అధికంగా ఉండి నీళ్లను వృధా చేస్తూ ఉంటారు అదే పల్లెల్లో ఉండే వారికి అతి తక్కువ సౌకర్యాలు లేక డబ్బు లేక కుళాయిల ఏర్పాటు చేసుకోలేక అల్లంత దూరాన ఉన్న బోరు బావులకు చెరువుగట్లకు వెళ్లి తెచ్చుకుంటూ ఉంటారు.
అలాగే పశుపక్షాదులు ఆ నీటితో దాహం తీర్చుకుంటూ ఉంటాయి.ఆ చెరువుగట్టులో అధికంగా పైపులు వేసి తీసి ఆ నీళ్లనే ఫిల్టర్ చేసే క్రమంలో నీరు వృధాగా పోతుంది ఆ నీళ్లను త్రాగునీరుగా మార్చి పట్టణాలకు పంపిస్తూ ఉంటారుఅందువలన చెరువులు తొందరగా ఎండిపోయి పల్లె ప్రాంతవాసులకు పొలాలకు నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటారు వాళ్ల కష్టం భగవంతుడికి తప్ప ప్రజలకు మాత్రం తెలియదు.
అలాంటి క్లిష్టతరమైన పరిస్థితులు వాళ్లు ఎదుర్కొంటూ ఉంటే..!ఆ నీళ్ల విలువ తెలియక దుర్వినియోగం చేస్తుంటాం.ఆ నీటిని మనం ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకుంటే మిగిలినవి ఇతరులకు ఉపయోగపడతాయి.దయచేసి పట్టణ ప్రాంత ప్రజలు వాటర్ ట్యాంకులలో నిలువ చేసిన నీటిని అవసరమున్నంతవరకే వాడుకోవాలని మనవి.
ఈ మధ్యకాలంలో మిషన్ భగీరథ పంపులను వేయించారు రోడ్లమీద ఎక్కడ పడితే అక్కడ నీరు ప్రవహిస్తూ ఉంటుంది పంపు వచ్చినప్పుడు ఆ నీటిని తగినన్ని వాడుకొని ఆ పంపు ని కట్టిస్తే ఆ నీళ్లు పల్లె ప్రాంతాల ప్రజలకు అందించిన వాళ్ళం అవుతాం. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పబ్లిక్ టాపులు వృధాగా ప్రవహిస్తూ ఉంటాయి.
మనకెందుకులే అని అనుకోకుండా ఆ పంపులను ఆపేయాలి. తద్వారా పట్టణ ప్రాంతాల ప్రజలతో పాటు పల్లె ప్రాంతాల ప్రజలకు కూడా నీళ్లు అందించబడతాయి.ఎవరైనా ఇంటికి ముందుకు వచ్చి దాహం వేస్తుంది అంటే విసుక్కోకుండా నీళ్లను ఇవ్వండి.భోజనం లేకపోయినా కూడా ప్రాణులు జీవిస్తాయి కానీ నీళ్లు లేకుండా ఏ ప్రాణి జీవించలేదు
కనుక అన్నదానం కన్నా నీళ్ల దానం గొప్ప పోయే ప్రాణం నిలుస్తుంది.నీళ్లను పొదుపుగా వాడుకుందాం అందరికీ అందేలా చేద్దాం.
మాధవి లత