తొలి ముద్దు
తొలిముద్దు అంటే అది
ప్రేమకు ఒక నజరానా
అందం అనురాగమనేది
ఊరించిన ఊహలలో
చిగురించిన ఒక ఆశే తొలిముద్దు
రెక్కలు విప్పిన కోరికలు
వలపు పిలుపుల కవ్వింత
నిరీక్షించిన కన్నులకు
నిజమై తెలిసినదే
తొలిముద్దు
సిగ్గు లోలికే నెరజానకు
ప్రణయ పారవశ్యం
తొలి ముద్దు
చెలిమి గుండెల్లో చేరుకున్న
సరిహద్దులు దాటిన ప్రేమకు
చిహ్నమే తొలి ముద్దు
అదే అతి పెద్ద బహుమతి
కావాలి జీవితంలో…
– జి జయ