తోడు
నిన్ను చూస్తూ ఉండిపోనా…
నీతో సాగిపోనా..
దగ్గర బంధానివి..
దగ్గరైన నేస్తానివి..
నీ చుట్టే తిరిగే ఆత్మ నేను..
ఎందుకో నువ్వు నువ్వు గుర్తస్తే
మనసులో ఏదో ఆనందం..
నీ నవ్వు చూస్తే నాకే సంబరం..
సాగి పోనీ మన బంధాన్ని ఎలాంటి బంధనాలు లేకుండా..
అమ్మవో, అయిన దానివో..
కూతురువో, నా నేస్తానివో..
నీకు ఏ పేరు పెట్టుకున్న
నువ్వు ఉండేది ఎప్పుడు నా తోనే..నా లోనే..
ఉండి పోరా చిన్నోడా…
ఎప్పుడు ఈ పిచ్చోడికి తల్లిలా…
నా ప్రేమ కు పేరు లేదు..
నీ పై ఆప్యాయతకు అస్సలు అంతే లేదు..
గుర్తుపెట్టుకో ప్రియ నేస్తం..
జీవితాంతం నీకు నీడలా ఉండే తోడు ఒకడు ఉన్నాడని..
వాడిని నువ్వు డాడీ అంటావని…
-ప్రవీణ్