ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?
సోషల్ మీడియాలో లేకపోతే జనావాసాలకు దూరంగా ఉన్నట్టా లేనట్టా?
నా అభిప్రాయం. అవును చాలా మంది సోషల్ మీడియానే తమ లోకంగా బతుకుతూ లైక్ ల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వాటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు అలాంటి వారిని చూస్తూ మిగిలిన వాళ్ళు మీరు లోకానికి దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేయడం ఎంత వరకు సమంజసం చెప్పండి?
లోకం లో సోషల్ మీడియా కన్న చాలా విషయాలు తెలుసుకో దగినవి చాలా ఉన్నాయి అని మిగిలిన వారు తెలుసుకోలేకపోతున్నారు. లైక్ షేర్ ల కోసం కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే ఇవ్వన్నీ వాడకుండా ఉండటమే ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.
సోషల్ మీడియా లో లేకపోయి ఉంటే కోవిడ్ సహాయం సమయానికి అందివ్వడం కుదిరి ఉండేది కాదు.ట్విట్టర్ లో వచ్చే ప్రతి రిక్వెస్ట్ ని డేటా సేకరించి తగిన సమయం లో అందరికి సేవలు అందించిన ఘనత సోషల్ మీడియా వల్లే సాధ్యం అయ్యింది. సోషల్ మీడియా ఎప్పుడూ చెడ్డది కాదు. తగిన రీతిలో ఉపయోగిస్తే ప్రయోజనకారి అవుతుంది. అన్నింటిలో మంచి చెడు ఉంటాయి. మంచిని తీసుకోవడమే మంచిది
మనిషి సంఘ జీవి.కాబట్టి సమాజంలో బ్రతకాలి…. యంత్రాలలో కాదు…
కానీ నేటి సాంకేతికత గొప్పదే కానీ అది మనల్ని యాంత్రిక జీవితానికి అలవాటు చేస్తుంది…
మనకు ప్రపంచాన్నంత పరిచయం చేస్తూ, కొత్త స్నేహాలను ఏర్పరుస్తు, అయినవాళ్ళని ,మనకు తెలియని/తెలిశ్న బంధువులను దూరం చేస్తుంది… మర్చిపోయేలా చేస్తుంది….
కాబట్టి సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉన్నట్టే, మన పరిసరాల్లో సమాజంలో కూడా ఆక్టివ్ గా ఉంటే బాగుంటుంది☺️👍