తోబుట్టువులు
తోబుట్టువులు తొలతగా పంచిన రక్తసంబంధం
మన నిర్ణయం లేకుండానే మనకు ప్రసాదించిన వరం
ఆప్యాయత అనురాగాలకు
నెలవు తోబుట్టువుల నెనరు
తోబుట్టువులకు నిలయం
అమ్మ గర్భపు ఆలయం
స్వచ్ఛమైన ప్రేమకి
శ్రేష్టమైన రుణబంధం
బాధ్యతాయుత భావాలు
వెలకట్టలేని త్యాగాలు
ఆత్మీయతకు పెన్నిధి
చెప్పలేనంత బలం
రక్షణ కవచమై కాపాడుతూ
పుట్టినింటి ఒదిగిన పొదరిల్లు
సంపద ఎంతో తెలియదు కానీ
తోబుట్టువులతో తెలియని ఎంతోబలం
అపూర్వ అనుబంధాలై వెల్లివిరియాలి అందరిలో తీపి జ్ఞాపకాల మందిరంగా
అదే తోబుట్టువులకు మేలు చేసే గొప్ప కానుక మరి ఈ లోకంలో……
_ జి జయ