తియ్యదనం
పండగరోజు పరమాన్నం
ప్రతి శుభ సందర్భం
తీపి తోనే మొదలుపెడతాం
ఉగాది పచ్చడి విశిష్టత
షడ్రుచుల సమ్మేళనం
జీవన సారం భావాల
కలయిక ల తో ముడిపడి
వుంది.
ప్రతి రోజు కు అన్వయించి
చూసుకోవచ్చు.
తియ్యదనం విశిష్టత
అంత మరి శాంతికి చిహ్నం
గా వుంటుంది. తీపి నే
అమృత తుల్యమైన ఆహారంగా తీసుకోవడం
మన ఆచార వ్యవహారాల
లో భాగం సత్వగుణ లక్షణాలు ఉంటాయి
తియ్య దనంలో . మనసు
ప్రశాంతినిస్తుంది మానసిక
అలజడిని సానుకూల పరుస్తుంది .
కాలానుగుణంగా ఋతువులు రుచులు
మారుతూ వుంటాయి
మన సంస్కృతి లో భాగంగా
తీపి కి ఎక్కువ ప్రాధాన్యత
సంతరించుకుంది . అన్ని
వేడుకల్లో చక్కర బెల్లం తో
తయారు చేసిన వంటకాలు
చేసుకుంటారు . జీవన విధానాన్ని అనుకూలంగా
మారుతుంటాయి. ముందు
తరాలవారికి పండగలు
వారధిగా మారుతాయి.
– జి జయ