తిరుమల గీతావళి
పల్లవి
హరినామమే కాపాడును
శ్రీహరి ధ్యానమే మన మార్గము
తపియించు మనసుకు
తన స్మరణ ఒకటే కైవల్యము
చరణం
కల్లోలమై ఈ జీవితం
కడలంచున సాగేనుగా
తన బాటలో సాగేందుకు
తననీడనే వెతికేందుకు
మన దుఃఖమే వీడేందుకు
అతనొక్కడే వెంటుండును
అభయాన్ని ఇచ్చి కాపాడును
చరణం
కానుకలు కోరడు
కోరికలు తీర్చును
గోరంత బతుకున
కొండంత వెలుగు
కోనేటిరాయుడై కరుణించువాడు
కలతలు నలతలు తీర్చేటివాడు
సకల శుభములను అందించువాడు
శ్రీనివాసుడతడు చిద్విలాసుడతడు
ఏడుకొండలపై కొలువున్నవాడు
-సి.యస్.రాంబాబు
తిరుమల గీతావళి చాలా బాగుంది.