తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

పల్లవి
కొండలరాయుని తలచుదాం
వేదనలన్నీ తెలుపుదాం
కలలోనైనా కనబడడే
కలతలు తీరేదెటులనో

చరణం
కొండలపైన ఉంటేనేమి
భక్తసులభుడు ఆతడు
బాధలు గాధలు ఉంటేనేమి
తనతోడొకటే చాలును/చాలునుగా

చరణం
తిరుమలరాయుని తీరేవేరు
తీరుబాటుతో కరుణిస్తాడు
ఆనందానికి హద్దేలేదని
ఏడుకొండలను చూపును

చరణం
ఏడుకొండలు ఎక్కాలంటే
తన పిలుపొకటే మార్గము
ఎన్నో జన్మల బంధము మనది
వెంకటరమణా రావయా

చరణం
అలిపిరి అందము చూసెదము
అలుపు సొలుపు వీడెదము
సప్తగిరులదో తన్మయనాదము
అదియే మనకు వేదము

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *