తిరుమల గీతావళి
పల్లవి
ఆపదలను తీర్చేటి ఆనందనిలయా
ఎంతని నిను వేడినా కానరావయ్య
కానుకలు తేలేము వడ్డికాసులవాడా
నీ నామమొకటే మా సంపదయ్యా
చరణం
నీ నీడలోనే పెరిగాము మేము
నీ నవ్వులోనే తడిశాము మేము
సప్తగిరులపైన కొలువున్న స్వామి
నీ చూపు కోసమై వేచాము మేము
చరణం
నీ తలపుతోనే కదిలాము మేము
కరుణాంతరంగ కదిలిరావయ్యా
కరిగే కాలము అవరోధమయ్యా
నిను చూడ రాలేము మన్నించవయ్యా
చరణం
కష్టాలు నష్టాలు కొత్తేమీ కాదు
నీ స్మరణతోటి దాటేము మేము
అల్పులము మేము మన్నించవయ్యా
నిను చూసే మార్గమే తెలుపరావయ్య
– సి.యస్.రాంబాబు