తిరిగొచ్చిన వసంతం

తిరిగొచ్చిన వసంతం

చల్లగా, మెల్లిగా, సంతోషంగా
సాగిపోతున్న నా జీవన స్రవంతి లోకి
మెరుపులా వచ్చిందొక ఎర్ర గులాబీ
తానే నా లోకమయ్యి,నేనే తానంటూ
నను మైమరపించేది ప్రతి రోజూ ప్రతి
క్షణక్షణం తన ఊసులే నా మధినిండా
తోలోచేవి, యుగలన్ని క్షాణాలుగా
క్షణాలు అన్ని నిమిషాలే అయిపోయాయి
ఇక తాను నాకే సొంతం అనుకున్న క్షణం లో
అప్పుడే పేల్చిందొక పెల్చిందొక విస్పోటనం
తన కోసం ఓ రోజు ఎదురుచూస్తున్న క్షణం లో
గాలివారుగా ఓ లేఖ నాకు చేరింది
నను మన్నింపు అంటూ ఆ లేఖతో
నేను చచ్చిన శవాన్ని అయ్యాను
క్షానాలు రోజులుగా రోజులన్నీ
యుగాలుగా గడిచాయి, నా ప్రేమ
నిజం కాదా నేను మోసపోయాను
అనే వేదనలో మునిగిపోయాను
అందరూ చెప్పిందే నిజమని తేలింది
ప్రేమలో చావు తప్పదు అన్నారంతా 
నేను కావాలనుకున్నా కానీ ఎవరో మోసం
చేసి వెళితే నా తల్లిదండ్రులకు ఎందుకు
శిక్ష వేయాలంటూ నా మనసు వెనక్కి
లాగింది… బాధ్యతలన్నీ గుర్తొచ్చి
నేనే లోకంగా బ్రతుకుతున్న నా వారికి
న్యాయం చేయాలని కొత్త లోకం వెతికాను
బాధ్యతలో పడి అంతా మరిచాను. క్షణాన్ని
నిమిషాలుగా నిమిషాలు అన్నీ రోజులుగా మారాయి
ఓ సరికొత్త ఉదయాన నా ఇంటి తలుపు ముందు
నా ఎర్ర గులాబీ దర్శనమిచ్చింది. కోపంగా తలుపు
ముసాను కానీ తను చెప్పింది విని నా కళ్ళు చెమర్చాయి.
మన జీవితం కోసం నేను సంపాదన కోసం
వెళ్ళనంటూ నిన్ను ప్రేమించాను అంటే
ఎవరూ ఒప్పుకోరు, జీవితాన ప్రేమ తో పాటు
బ్రతకడానికి డబ్బు కావాలని చెప్పడం తో
తలుపులు తెరచి తనను కౌగలించుకున్నాను 
కానీ పట్టు జారీ పడిపోతూ ఉంటే తానే ఆసరా అయ్యి
గోడకున్న నా కట్టే కాలును తెచ్చి ఇచ్చింది.

నా ఇసరికొట్ట లోకం లోకి తిరిగొచ్చిన వసంతంలా మారింది.

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *