థ్రిల్ సిటీ
థ్రిల్ సిటీకి వెళ్దామని పిల్లల గోల నాకేమో చాతకాదు నేను రాను తిరగలేనని నా బాధ.. నన్నొక్కదాన్ని ఇంట్లో ఉంచి వాళ్లు వెళ్లలేరు.. చివరకు పిల్లల సంతోషం కోసం లేని ఓపిక తెచ్చుకుని బయలు దేరాను..
అంతా టికెట్లు తీసుకుని లోపలకు వెళ్లామో! లేదో! అన్నీ గేమ్సే! మా బాబు స్కిప్పింగ్ ఆడాడు వాడు ఫస్ట్ వచ్చాడు దాంతో ఫ్యామిలీ అందరినీ పిలిచి స్టేజ్ పైన గిఫ్ట్ లాప్ టాప్ బ్యాగ్ ఇచ్చారు అదయి కిందకు వచ్చామో! లేదో! మా ఇద్దరు మనవరాల్లు బాల్ ఆట ఆడారు దానికి టికెట్ పెట్టి కొన్నాం!
దాంట్లో ఇద్దరూ టెడ్డీబేర్ బొమ్మలు గెలుచుకున్నారు. తరువాత మళ్లీ మా బాబు ఆడాడు బాల్ గేమే! వాడు కూడ టెడ్డీ బేర్ ఎలిఫెంట్ బొమ్మ గెలుచుకున్నాడు ఇలా అందరం థ్రిల్ సిటీలో థ్రిల్ అయ్యాం! నాకయితే ఆపలేని సంతోషం వచ్చింది…. ఇంట్లో ఉంటే ఇవన్నీ చూడలేక పోదును కదా! అనిపించింది..
మనవాళ్లు గెలుచుకున్నా మనకెంతో సంతోషం కదా!!
– ఉమాదేవి ఎర్రం