తీరం
జీవన ప్రయాణపు నావ
నీవు నడపనిదే కదలదు
కాలం ఆగదు నీ కోసం
కానీ గమనం మాత్రం నీదే
అలల తాకిడి అయినా
నీ వాళ్ళ కోసం నీవు చేసే
ప్రయత్నం
కనుచూపు మేరలో
కదిలే కెరటం చూస్తూ
ప్రపంచం ఎక్కడున్నా
నీవు మాత్రం నీటిపైనే
నీకు తోడు నీ దైర్యమే
నావ వున్నా నడిపించే
శక్తివున్నా నీ తలపే
ముందు వుంది
మార్గం మలుపులు తిరిగినా
తీరం చేరాల్సిందే
ఆలోచించకు పయనం
ఆపకు పద ముందుకు సాగిపోవాలి సంసార
నావలా …….?
– జి జయ