తెలుసుకో
కడలి పొంగినా స్త్రీకంట నీరు వొలికినా
కుంచె చెదిరినా కుర్చీ కాలు విరిగినా..!!
కర్షకుడి హలం చెదరినా కవి కలం పొంగినా
కన్నెలాడి పై ఎద జారినా కోడిగిత్త బెదిరినా…!!
కందిరీగ కుట్టినా కాల సర్పం కాటేసినా
కాలం కలిసి రాకున్నా కలవారు తొడులేకున్నా..!!
కదనరంగమున తురగము కాలుదువ్వినా
కుక్కుటపు కాలికత్తి కరుణ లేక కరుడు గట్టినా..!!
కలహంస నాట్యమాడి కలువకళ్ళు మూసినా
కలవారి కొడలు సత్తు నాణ్యములు విసిరినా…!!
కవితకు పద ప్రాస భావన కరువై నా
కవన వనమున కాంతి పూలు పూయ కున్నా..!!
కనకున్న పొంగు కన్నీరు కడలి ధారాలై
కాలానికి పట్టిన విష సర్ప బుస కోరలై….,!!
-గురువర్థన్ రెడ్డి