తెలుగు తేజం
అనురాగ వల్లి తెలుగు తల్లి .
సెలయేటి వంపుసొంపుల లావణ్య జాక్షి మన తెలుగు
రంగురంగుల ఇంద్రధనుస్సు వన్నెల అందం మన తెలుగు.
అగరు పొగరుల ధూప గుభాళింపు మన తెలుగు ..
చీకటి చిదిమి వెలుగులు నింపే జ్ఞాన దీపిక మన తెలుగు.
ప్రకృతి మురిసి విరిసిన సుమ పరిమళం మన తెలుగు ..
లేగదూడ ఆనంద చిందుల విన్యాసమే మన తెలుగు ..
పవనుడు అలలపై మోసే సుమగంధమే మన తెలుగు.
ఝుంటి తేనియల మకరందమే మన తెలుగు.
కమ్మగా పండిన మధుర మామడి పండు మన తెలుగు.
పాడిదుత్త చిలికి తీసిన వెన్నలాంటి లాలిత్యం మన తెలుగు
ఎందరో కవులను కీర్తి శిఖరం ఎక్కించిన ఘనతే మన తెలుగు.
అన్ని భాషలకన్నా మిన్నైన మన తెలుగు .
తర్కంలోను , చమత్కారంలోను , ప్రాస కవితలలోను ,సరిగంగ మన తెలుగు…
శతక పద్యములలోను . కవన పరంపరలోను మధురమై విరాజిల్లెను మన తెలుగు …
గజల్ గమకాలలోను , అవధానాల సరళిలోను అలరారుతోంది సింధూరమై మన తెలుగు …
అన్నమయ్య ఆలాపనా ఆద్యాంతం పతిధ్వనించే మన తెలుగు ..
పద్య , గద్యా రచనలలో గండపెండేరమే మన తెలుగు ….
ఎకసెకాల సరసపు చిలిపితనమే మన తెలుగు …
నవ్యకాంతుల భవ్యాలోచనల భావి భారతం మన తెలుగు ..
ఎందరెందరో కవీంద్రులు తెలుగు తల్లి పాద పూజలో
తరించి చిరంజీవులై హృదయాలలో నెలకొన్నారు అక్షరంగా …
ఎప్పుడూ వెలగాలి ఉషోదయంలా
తెలుగు భాష అనుదినం అక్షర పూజలో
నవ్య కాంతుల రాజసంలా తూగుతుంది మన తెలుగు దిగంతాలలో …
మమతగా మనం పొదివి పట్టుకుంటే .
మన పిల్లల హృదయాలలో నింపుతుంటే …
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు..
అందరికీ ధన్యవాదాలు..
-సత్యవతి ఆలపాటి