తెలుగు మా (తృ) భాష!!
తెలుగు పొల్లు
ముల్లు సమానము.
నేర్చి సంధిస్తే,
విలువ విల్లు సరి ఔను!
సందు తప్పుడేల,
సంధి నేర్చిన,
మార్గము సంధిదే కదా!
మాల రీతి కాదు,
పద్య మాలని కట్టుట.
అట్లు చేసిన నీ మెడను
చేరు పసిడి మాలలు.
గణ విభజన నీకు గడ్డు.
గ్రహించి గుణించిన,
గ్రహాల ఆగ్రహాలు పండు.
గురు గ్రహ ప్రాప్తి మెండుగ నుండు.
– వాసు