తెలుగు లోగిలి
గుమ్మానికై తోరణం
ధరవాజుకై దీపం
మన ఇంట లోగిళ్లకు
శోభకృత్ తెలుగు నామ సంవత్సరానికి స్వాగతం
చైత్రమాస ప్రారంభం
శుభ సంతోషాలకు సంకేతం
రతనాలా రంగు రంగుల అల్లికల ముగ్గులు
కిల కిల కూసే కోయిలమ్మ రాగాలు
నెమలి సొగసుల నాట్యలు
పసిడి పాడిపంటల పచ్చదనాలు
మనసుకు తీపితో మమేకంగా
కారంతో మమకారంగా ఉంటూ
వేప పూల విహారంతో
చింత చిగురుల కలివిడిగా
షడ్రుచులు కలిసిన ఉగాది ఔషద పచ్చడి
కోవెలలో పంచాంగ శ్రవణాలతో
అనాదిగా వస్తున్న ఆచారాలతో
సమస్త లోకానికి శాంతి
భోగ భాగ్యాలు కలగాలని
కొత్త ఆశలతో మన ఇంటి
తెలుగు లోగిళ్లకి స్వాగతం పలుకుదాం
ప్రతి ఒక్కరికి తెలుగు శోభకృత్ నామ సంవత్సర
శుభాకాంక్షలు
– స్వరూప