తెలంగాణా అవతరణ దినోత్సవం

తెలంగాణా అవతరణ దినోత్సవం

కోటి రతనాల వీణ నా తెలంగాణా ముమ్మాటికీ

తెలంగాణ స్వరాష్ట్రం కోసం
ఆరాట, పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు,

మరి ఎందరో అమర వీరుల ఆత్మ బలిదానాల ప్రతిఫలంగా సాధించుకున్న ఏకైకరాష్ట్రం.
ఎన్నో సంవత్సరాలుగా కలలుకనిచరిత్రసృష్టించి
సాధించిన గొప్ప రాష్ట్రం
తెలంగాణ.
ఎన్నో వనరులువున్నావాటిని
ఉపయోగించుకునే అవకాశం లేక వెనుకబడిన
ప్రాంతాలుగామిగిలిపోయాయి అంతే కాకుండా విద్య
ఉపాధి , అవకాశాల లో అసమానతలు ,పరిపాలనలో అనేక రంగాల్లో వివక్షకు
గురి అయినది. అప్పటి పరిస్థితుల నుండి బయట పడి ప్రత్యేకంగా నిలిచింది.

ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా వున్న ప్రాంతాలు
సంక్షేమం లేకుండా వున్న
వాటినినదీజలాలవినియోగం ద్వారా సస్య శ్యామలం అయ్యాయి. విద్యుత్తు ను
నిరాటంకంగా, సరఫరా ద్వారా వ్యవసాయ రంగం
అభివృద్ది చెందింది.
సాహితీ రంగం కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించకున్నది దానిద్వారా ప్రతిభ వున్నవారికి అవకాశాలు వస్తున్నాయి తెలంగాణ శక్తి
పరిపాలన ద్వారా సాహసోపేత నిర్ణయాలు, విధానాలు తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఆకట్టు
కుంటున్నాయిఅనిచెప్పవచ్చు తెలంగాణ రాష్ట్ర ముఖ్య పట్టణం హైద్రాబాద్
అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధిగుర్తింపుతెచ్చుకున్న ఆదర్శ వంత మైన పట్టణం.

అనేక రకాలుగా పల్లె నుండి
పట్టణం వరకు తనదైన రీతిలో గుర్తింపు కి నోచుకుంది
అన్ని రంగాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ వినూత్న శైలిలో నిర్మాణం
జరుగుతుంది
గ్రామీణ వ్యవసాయం
పట్టణాల సుందరీకరణ
వైద్య సేవలు
విద్యారంగంలో మార్పులు
ఉద్యోగాల్లో ప్రాంతీయ అవకాశాలు
అడవుల , పర్యావరణ పరిరక్షణ
ఐ టి రంగంవిశిష్ట అభివృద్ది
చేతి వృత్తుల కు చేయూత
రవాణా వ్యవస్థ
రెవెన్యూ చట్టాలు
శాంతి భద్రతలు
మహిళా రక్షణ
ఆలయాల అభివృద్ది
పారిశ్రామిక ప్రగతి
ఆదునిక సాంకేతికత
వినియోగం
వృద్దులకు పెన్షన్లు
నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణం
ఆరోగ్య కార్డులు
సంక్షేమ పథకాల అమలు
మిషన్ కాకతీయ ద్వారా
నీటి వినియోగం
జల వనరుల ప్రాధాన్యం
రైతు రుణాలు
ఆహారోత్పత్తి లో గణనీయ అభివృద్ది
నిర్మాణ రంగ అభివృద్ధి
వాక్సినేషన్ ప్రక్రియ
చేనేత కార్మికులకుసహాయం
ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షణ,
విద్యార్థులకు వసతి కల్పన
కొత్త జిల్లాల రూపకల్పన
న్యాయస్థానాల ఏర్పాటు
ప్రాజెక్టుల వ్యయ ప్రాధాన్యం
విపత్తుల నుండి బయట
పడటం
అంతర్ రాష్ట్ర సంబంధాలు
క్రీడా రంగానికి ప్రాధాన్యత
దాన్యం కొనుగోలు
ధరల క్రమబద్ధీ కరణ
అంతర్జాతీయ వేదికలు
ప్రభుత్వ పౌర సంబంధా లు
ఇలా ఎన్నో రంగాల్లో
తెలంగాణ రాష్ట్రంఅభవృద్ధి
పథంలోముందుకుసాగుతోంది . ప్రత్యేక రాష్ట్రం గా
అవతరించిన తరువాత
అనేక సవాళ్ళను ఎదుర్కొని
స్వయంసమృద్దితోఅడుగు
లు వేస్తోంది.

రాష్ట్ర అవతరణ దినోత్సవం
సందర్భంగా అందరు సుఖ సంతోషాలతో ఉండాలని
కోరుకుందాం ……….

జై తెలంగాణ !
జయహో తెలంగాణ!

– జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *