తీరని కోరిక
జీవితమైదానంలో అలుపెరుగని ఆటలో
ఆశ, కోరిక, అనే రెండు పదాల పందెంలో సృష్టి కర్త
జగన్నాటకం లోప్రతిమనిషికి
తీరని కోరికలు వుంటావని
అనుకుందాము. అవి
మనిషిప్రయత్నపూర్వకంగా
సాధించుకునేవికొన్నిఅయితే
సాధనకానివికొన్నిఉంటాయి
“జీవితంలో ఒకేఒక్క సారి
చేయాలనుకున్నాచెయ్యలేని
ప్రయత్నించినా కానివి కొన్ని”
వయస్సుతెచ్చేమార్పులు
సమయం సందర్భం లేకపోవడము కొన్ని నేర్చు కోవాలి అనే ఉత్సాహం లేక
కాలం ఒడిలో కనుమరుగు
అవ్వడం.
అమెరికా అధ్యక్షుడు బైడ న్
కి ట్రైన్ లో వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని వుండే నట కాని భద్రత వల్ల కుదరదు .
పురాణాల్లో కథ ప్రకారం దేవుడు వరం అడిగి తే
నాకు అష్ట ఐశ్వర్యాలు కావాలని అడిగాడట ఒక
మనిషి అదిఅనుభవించాక
కొన్నాళ్ళకు అన్ని వున్నాయి కాని తృప్తి లేదు అన్నాడట
చివరకు ఏమికావాలో కోరుకో
అంటే ఏమివద్దు దేవుడా తృప్తి నివ్వుచాలుఅన్నాడట
కొందరికి తీరని కోరికలు
చాలా విచిత్రంగావుంటాయి
కొందరికిసాధారణంగా
వుంటాయి కాని ముగింపు
వుండదు.
– జి జయ