తీరని గోస
మేఘాల ఘర్జన
ధారాళంగా వానలు
తీరని జనాల గోసలు
పొంగుతున్న వాగులు వంకలు
పోర్లే వరదలు
నిండా ముంచిన అధికవానలు
గంగమ్మ పరవళ్లు
అన్నదాతల అగచాట్లు
రవాణాకి అంతరాయం
దారులన్నీ గోదారులై
అవస్థలు తప్పవు అందరికి
ఆందోళన చెందినా ఆగవు
అవకతవకలు
చికాకు పెట్టే వానల్లో
బడిగోస
తిండి గోస
గూడుగోస
నీడగోస
రోడ్ల గోస
పనుల గోస
పంట గోస
ప్రయాణాల గోస
ఉద్యోగుల గోస
కూలీల గోస
కష్ట నష్టాల గోస
అన్నీ కలిపితే జనం గోస
సందట్లో సడేమియా వలె
రాజకీయాలగోస
ఆరాటమే కాని చేసేది ఏమీ
లేక బ్రతుకు గోస ……?
– జి జయ