తీపి జ్ఞాపకాలు
పసి వయసులో నన్ను ముద్దాడిన నేలను
చిన్ననాటి మిత్రులను , బళ్ళో చేసిన అల్లరిని
జ్వరం వచ్చిందనే నెపంతో బడి ఎగ్గొట్టి ఆడుకున్న రోజులను
అవకయా బద్దలను జేబులో వేసుకుని తిన్న రోజులను
వెన్నెల్లో అమ్మ పెడుతున్న గోరు ముద్దలు ఎంత తింటున్నా
తింటూనే ఉండడం అమ్మ ఇక చాలని అంటున్నా పెట్టమ్మా అంటూ బతిమాలడం. వెన్నెల్లో వాకిట్లో పడుకుని చుక్కలు లెక్కించడం . తమ్ముళ్ళ తో గొడవ పడడం , మార్కులు తక్కువ వచ్చాయని నాన్నగారి తో దెబ్బలు తినడం ఇలా ఎన్నో జ్ఞాపకాలు. అమ్మ పెట్టిన చేతి లోని గోరింటాకు చూస్తూ సంబర పడడం ,కంచం లో అన్నం తిన్న తర్వాత దాంట్లో ఆ ఆ లు రాసుకోవడం . అమ్మ రొట్టెలు చేస్తుంటే పిండి తీసుకుని బొమ్మలు చేయడం, బతుకమ్మ పండుగకు రకరకాల పువ్వులు తేవడం, వినాయక చవితికి వచ్చే ఒమన గాయాలను ఉప్పుతో నంజుకుని తినడం , స్కూల్ లో పక్క దోస్తు జడ లాగి ఏమి తెలియనట్లు పక్కకు చూడడం .ఇలా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మోస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తూ గడపడమే. అవే మన తీపి జ్ఞాపకాలు
– భవ్య చారు