తప్పు తనది

తప్పు తనది

సీతారత్నం కుమారుడు రాజుకు ఈ మధ్యనే పెళ్ళి అయ్యింది. రాజు భార్య పేరు రాణి. భలే కుదిరాయి కదా పేర్లు. పేరుకు తగ్గట్టే రాణికి ఏ పనీ తెలియదు. ఆమెను వారి తల్లిదండ్రులు రాణిలాగానే పెంచి పెద్దచేసారు. ఏ పనీ నేర్పలేదు. ప్రతి పనినీ నౌకర్లతో చేయించటం వల్ల ఆమెకు ఏ పనీ రాదు. వంట చెయ్యటం అసలే రాదు. కోడలు వస్తే అన్ని పనులూ కోడలికి అప్పగించి హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్న సీతారత్నం ఆశ అడియాసగా మారింది.

అప్పుడే సీతారత్నం ఒక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులు తీర్ధయాత్రలకు వెళ్ళి రావాలని ఆలోచన చేసింది. అప్పుడు ఆమె భర్త “కోడలు కొత్తగా ఇంటికి వచ్చింది. పైగా ఏ పనీ రాదు. అలాంటి స్ధితిలో కోడలిని వదిలిపెట్టి వెళ్ళటం తగునా?”అని అన్నాడు. అప్పుడు సీతారత్నం”ఆ మాట నిజమే కానీ మనం ఇక్కడ ఉంటే మన కోడలు ఏనాటికీ పని నేర్చుకోదు. పని రాకపోవటం ఆమె తప్పు కాదు. ఆమె తల్లిదండ్రులు అతి గారాబం చేయటం వల్ల ఆమె పని నేర్చుకోలేదు.

నిజంగా చెప్పాలంటే మన కోడలు చాలా తెలివిగలది. తొందరగా పని నేర్చుకుంటుంది. అందుకే కొన్నాళ్ళు మనం ఎక్కడికైనా వెళితే కొంతవరకు అయినా ఇంటి పని నేర్చుకుంటుంది. అవసరం అయితే తన అమ్మను సహాయం కోసం పిలుస్తుంది. ఖంగారు పడవద్దు”అని చెప్పింది. సీతారత్నం అనుకున్నట్లుగానే వారు తీర్ధయాత్రలకు వెళ్ళి వచ్చేటప్పటికి ఆమె కోడలు అన్నిపనులూ నేర్చుకుంది.

నిజంగా చెప్పాలంటే ఇంటికి దీపం ఇల్లాలే.

– చెలసాని వెంకట భాను ప్రసాద్

0 Replies to “తప్పు తనది”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *