తప్పు
ఒకరోజు వికసించిన పువ్వు
తర్వాత రోజుకి వాడిపోతుంది..
కానీ కొందరు అనే మాటలు
మనసుకి సూటిగా గుణపాల తగులుతాయి..
వాళ్ళు చేసిన చిన్నపొరపాటుని సరిదిద్దునందుకు
నేను చేసిన చిన్న తప్పుని అడ్డుపెట్టుకొని
నన్ను సూటిపోటి మాటలతో
జీవితాంతం వేధిస్తూనే ఉన్నారు..
నేను గతంలో ఒక విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు
వాళ్ల చేత మాటలు పడుతూ
జీవితాంతం బాధపడుతూనే ఉన్నాను..
నీ నిర్లక్ష్యపు వాకిట వల్లే
మేము నిన్ను భరించవలసి వస్తుంది..
నేను గతంలో చేసిన తప్పుకి
ఇంకెన్నాళ్ళు శిక్ష అనుభవించాలి..
నా తప్పుని ఒప్పుకున్నా కూడా శిక్ష అనుభవించాలా?
వాళ్ళు మాత్రం నన్ను ప్రతి విషయంలో టార్గెట్ చేస్తున్నారు..
ఇంకెన్నాళ్ళు ఈ బాధ అనుభవించాలి…
వాళ్లకి ఎదురు తిరిగిన ప్రతిసారి
నన్ను ఇంకా హింస పెట్టుతున్నారు..
నేను చేసిన తప్పుని సరిదిద్దడానికి ప్రయత్నం చేశాను..
ఒక మనిషి చేసిన తప్పుని నిందించడం తప్పు కాదు.
కానీ తప్పుని అడ్డు పెట్టుకొని వాళ్ళని బాధ పెట్టడం తప్పు..
తప్పులు ఎవరు చేయడం లేదు..
అలాగని అందరూ అమాయకులు అని అనుకోవడం తప్పు..
-మాధవి కాళ్ల