తప్పు
అజయ్,విజయ్ చిన్ననాటి నుండి స్నేహితులు. ఇద్దరు ఒకే పాఠశాల లో కలిసే చదువుకున్నారు. చదువులు అయ్యాక పోషణకై ఎవరి దారిలో వాళ్ళు ఉద్యోగ వేటకు వెళ్లారు. అజయ్ ఉన్న ఊర్లోనే ఉంటూ సిమెంటు వ్యాపారం చేస్తూ బాగానే సెటిల్ అయ్యాడు. కానీ విజయ్ మాత్రం ఏవేవో కోర్సులు నేర్చుకుంటూ ఏ ఉద్యోగం రాక చివరికి సేల్స్ మెన్ గా స్థిర పడ్డాడు.
అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవడమే తప్ప ఇద్దరి పనుల వత్తిడి వల్ల ఎప్పుడూ కలుసుకోలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. అజయ్ సిమెంటు వ్యాపారం లో బాగా సంపాదించడం వల్ల తల్లిదండ్రులు పెళ్లి చేద్దాం అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా సంభంధాలు చూడడం మొదలు పెట్టారు. తల్లిదండ్రులు ఏది చేసినా నా మంచికే అని నమ్మే అజయ్ తన పెళ్లి విషయం వారికే వదిలేశాడు. వాళ్ళు వెతికి వెతికి ఒక మంచి అమ్మాయిని చూశారు. అజయ్ కి కూడా అమ్మాయి బాగా నచ్చింది.
దాంతో పెళ్లి పెట్టుకున్నారు.పెళ్లికి అజయ్ విజయ్ నీ ఆహ్వానించాడు అందరితో పాటూ గా , చాలా ఏళ్ళ. తర్వాత విజయ్ తన ఊరికి వచ్చాడు. వచ్చి రాగానే. అతనికి విజయ్ వ్యాపారం చేస్తున్నాడని చాలా సంపాదిస్తున్నాడు అని తెలిసింది. ఇద్దరం ఒకే బళ్ళో చదివాము . నా బతుకేమో ఇలా అయ్యింది.
వాడేమో ఉన్న ఊర్లోనే బాగా సంపాదిస్తున్నాడు. అని అసూయ తో రగిలి పోయాడు విజయ్. పైగా పెళ్లికి వెళ్ళినప్పుడు అజయ్ భార్య ను చూసిన విజయ్ కి మతి పోయింది. ఇంత వరకు తానెంతో మంది నీ చూసాడు కానీ ఇంత అందమైన అమ్మాయి నీ చూడలేదు. దాంతో ఆమెను ఎలాగైనా అనుభవించాలి అనే దుర్బుద్ధి అతని కి కలిగింది.
విజయ్ కు పెళ్లయ్యింది కానీ భార్యంటే అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు. తల్లిదండ్రుల బలవంతం తో చేసుకోవడం వల్ల ఎప్పుడూ గొడవలు అవుతుండడం తో ఆమె అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా అతను వినక పోయేసరికి ఊరుకున్నారు ఏమి చేయలేక.
అజయ్ భార్యను చూడగానే అతని మనసు చలించింది.తనకెందుకు ఈ అదృష్టం పట్టలేదని మనసులో అసూయా ద్వేషాల తో రగిలిపోతున్న కూడా మొహం లో అదేమీ కనిపించకుండా వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలిపి , చెల్లెమ్మ మా వాడు జాగ్రత్త అంటూ వరస కూడా కలిపాడు. పాపం ఆ పిచ్చిది భర్త స్నేహితుడి అనుకుని అలాగే అంది.
పెళ్లయ్యాక స్నేహితుడి ఇంటికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఆమెతో పరిచయాన్ని పెంచుకోసాగాడు విజయ్. అజయ్ తన స్నేహితుడు చాలా రోజులకు వచ్చాడు అనుకుంటూ ఇంటికి వచ్చినా ఏమి అనేవాడు కాదు. అలా రోజులు గడుస్తున్నాయి. విజయ్ ఉద్యోగం మానేసి ఆమెని ఎలాగైనా అనుభవించాలని చూస్తున్నాడు. అలాంటి సమయం లో ఒక రోజు పట్ట పగలు అజయ్ తిని వెళ్ళాక ఏమి తెలియనట్లు అజయ్ కోసం వచ్చినట్టు వచ్చాడు విజయ్
అజయ్ లేడామ్మా అంటూ అడిగాడు.అయ్యో అన్నయ్య ఇప్పుడే భోంచేసి వెళ్ళారు షాప్ లో ఉండొచ్చు అంది ఆమె. అవునా అయితే ఇప్పట్లో రాడు కదా అన్నాడు. లేదు అన్నయ్య లోడ్ వస్తుంది లేట్ అవుతుంది అన్నారు అంది .అహ అయితే మంచి సమయం మించిన దొరకదు అంటూ కాస్త ముందుకు వచ్చి రా మనం ఎంజాయ్ చేద్దాం నువ్వంటే నాకు చాలా ఇష్టం అసలు పెల్లిరోజే నీ మీద మనసు పడ్డాను. రా వాడికి తెలియకుండా నేను చూసుకుంటాను భయపడకు అంటూ పై పై కి వచ్చాడు.
అమె అతని నిజ స్వరూపం చూసి బిత్తర పోయి ఆ తర్వాత తెలివి తెచ్చుకుని ఛీ నిచుడా చెల్లి అని పిలిచి ఇలా అనడానికి నీకు సిగ్గు లేదా నువ్వు మనిషివా , పశువ్వా స్నేహితుడు భర్యాను చెరచలని చూస్తావ సిగ్గు లేదు. ఇంకా వచ్చవంటే నలుగురు నీ పిలుస్తాను మర్యాదగా వెళ్ళిపో నిన్ను నా భర్త ఎంతగా నమ్మాడు.
అతనికి ద్రోహం చేయాలని చూస్తావా. అన్నా అని నోరారా పిలిస్తే ఇంతగా తెగిస్తావా మర్యాదగా వెళ్తవా లేదా అల్లరి చేసి నీ పరువు తియమంటావా అంటూ తిట్టింది. నాకు తెలుసు ఇప్పుడు బెట్టు చేసినా ఏదో ఒక రోజు నువ్వు నా చేతిలో నలిగిపోక తప్పదు. చూస్తా నువ్వు ఎలా లోంగవో అంతగా అయితే అజయ్ గాడిని లేపేసి అయినా నిన్ను దక్కించుకుంటా అంటూ వెళ్లిపోయాడు.
అతను అన్న మాటలకు ఆమె వెర్రిగా చూస్తూ ఉండి పోయింది.లొంగక పోతే నా భర్తను చంపుతాడు అంట , ఒక స్నేహితుడు ఇలా చేస్తాడు అని అస్సలు అనుకోలేదు ఈ చేత్తో అన్నం తిని నన్నే కాటు వేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం అజయ్ కి చెప్తే ఊరుకుంటాడా వెళ్లి గొడవ పెట్టుకుంటాడు.
ఆ గొడవలో అతన్ని చంపినా చంపుతాడు ఆ తర్వాత ఆయన జైలు కి వెళ్తాడు అమ్మో ఇలా జరగ కూడదు అంటే నేను ఏమి చెప్పకూడదు. కానీ వాడిని మళ్లీ ఇంటికి రాకుండా చూసుకోవాలి ఆయనకు చెప్పాలి అనుకుంటూ అజయ్ వచ్చింది కూడా గమనించలేదు.
ఏంటి బంగారం అంతగా ఆలోచిస్తున్నావు అన్న అజయ్ మాట వినగానే అప్పటి దాకా అనుకున్నవన్నీ మర్చిపోయి అతని ఎద పై వాలి జరిగింది అంతా చెప్పేసింది.
ఆ మాటలు విన్న అజయ్ కోపం తో రగిలిపోయాడు చిన్ననాటి మిత్రుడు అని నమ్మి దగ్గరికి రానిస్తే నా ఇంటి ఇల్లాలిని చేర పట్టాలని చూస్తాడా, వాడికెంత ధైర్యం,పోని అని నామ్మినందుకు నాకే ద్రోహం చేయాలని చూస్తాడా,వాడి అంతు చూస్తాను అని ఆవేశ పడ్డాడు. కానీ ఆమె వద్దండీ వాడి పాపాన వాడే పోతాడు వదిలేయండి. ఆ దేవుడు అన్ని చూస్తున్నాడు. మీరు ఆవేశ పడితే నేను అనాథను అవుతాను అంది.
దాంతో ఆలోచనలో పడ్డాడు అజయ్ లేదు వాడిని ఊరికే వదల కూడదు అలాగని నేను ఇరుక్కోకూడదు. అలాగని ఊరుకుంటే నన్ను చేతకాని వాడు అని అనుకుంటాడు.అని అప్పటికి ఊరుకున్నాడు.భర్త శాంతించాడు అని భావించి ఆమె కూడా మర్చిపోవడానికి ప్రయత్నం చేయాసాగింది.
నాలుగు రోజులు మొహం చాటేసిన విజయ్ అయిదో రోజు ఇక ఆగలేక అజయ్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె చెప్పలేదు అని నిర్ధారించుకుని ఏమి కాదు అనే ఉద్దేశ్యం తో ఆ ఆడది భయపడి ఉంటుంది లే అని అనుకున్నాడు.
ఎప్పటిలా ఏమి తెలియనట్లు అజయ్ షాప్ కి వెళ్ళాడు విజయ్. అజయ్ కి విజయ్ నీ చూడగానే చాలా కోపం వచ్చింది.కానీ తనకు ఏమీ తెలియనట్టు ఎం రా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు.అసలు దర్శనమే లేదు అంటూ ప్రేమగా మాట్లాడాడు. విడింత ప్రేమగా మాట్లాడుతున్నాడు అంటే ఆమె ఏం చెప్పలేదు అని నిర్ధారించుకుని, ఏమి లేదురా మా సర్ రమ్మన్నాడు అందుకని ఓ నాలుగు రోజులు వెళ్ళొచ్చాను అంటూ కబుర్లు చెప్పాడు.
సరే రా అవును కానీ నాకు వ్యాపారం లో ఎక్కువ లాభాలు వచ్చాయి రా , ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలని అనుకుంటున్నా కానీ నువ్వేమో లేవు, సరే కానీ ఈ రోజు పార్టీ చేసుకుందాం రా అన్నాడు అజయ్ విజయ్ తో అవును రా నువ్వు నీ పెళ్లి పార్టీ కూడా ఇవ్వలేదు. రెండూ కలిపి ఈ రోజే ఇచ్చేయు అన్నాడు ఫ్రీ గా మందు దోరుకుంతుంది అనే ఉద్దేశ్యం తో విజయ్.
అయితే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను మన తోట కి సాయంత్రం ఏడు గంటలకు వచ్చేయి అన్నాడు అజయ్ విజయ్ తో సరే రా అలాగే వస్తాను అని చెప్పి వెళ్ళాడు విజయ్ వెళ్తుంటే పళ్ళు నురుకున్నాడు అజయ్.
***
ఇక ఆ రాత్రి అజయ్ తోటలో మందు ఏర్పాట్లు రంజుగా ఏర్పాటు చేశాడు.అన్ని రకాల మందులు, అన్ని రకాల తిండి అన్ని ఏర్పాట్లు చేశాడు.
అవన్నీ చూసిన విజయ్. అరె ఎందుకు రా ఇవన్నీ నా ఒక్కడి కోసం నువ్వెలాగు తాగవు కదా అన్నాడు . నేను తాగాను రా కానీ నువ్వు రెండు పార్టీ లు కలిపి అడిగావు కదా అందుకే నీ కోసం నీకు ఇష్టమైనవి అన్ని తెప్పించాను. నీకూ ఎంత నచ్చితే అంత తాగు తిను రా నీకన్నా నాకు మంచి మిత్రుడు ఎవరున్నారు రా అన్నాడు అజయ్. కపట ప్రేమ చూపించాడు.
ఆ మాటలు విన్న విజయ్ అబ్బా దోస్తు వంటే నువ్వెరా నా కోసం ఇన్ని రకాలు తెప్పించావు ఇక అగుతానా అంటూ తాగడం మొదలు పెట్టాడు.అజయ్ మాత్రం జ్యూస్ తాగుతూ కూర్చున్నాడు. ఇక్కడ విజయ్ ది కూడా కపట ప్రేమ నే
అలా ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తాగుతూనే ఉన్నాడు అజయ్. ఇక దొరకదేమో అన్నంత ఆత్రంగా తాగుతూ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో మాటగా అరేయి నీ భార్య ఏముంది రా సూపర్ గా ఉందిరా, నువ్వు నాకు చిన్నప్పటి నుండి దోస్తు వు కానీ ఒక్క విషయం లో నన్ను అన్యాయం చేసావు రా అంత అందాన్ని నువ్వొక్కడివే అనుభవించడం కాకుండా నాకు ఒక రోజు పoచొచ్చు కదా రా అంటూ నోరు జారాడు.
ఆ మాటతో అప్పటికే కోపంగా ఉన్న అజయ్ ఇప్పటి ఈ మాటలతో ఇక కోపాన్ని ఆపుకోలేక ఏమన్నవు రా అంటూ అక్కడే వున్న పోర్క్ తో విజయ్ గొంతు లో పొడిచాడు. అబ్బా అబ్బా అంటున్న విజయ్ నీ చూస్తూ ఏరా స్నేహితుడి వి అని చనువు ఇస్తే నా ఇంటికే ఎసరు పెట్టాలని చూస్తావా నా భార్య తో పిచ్చి గా ప్రవర్తిస్తావా అంటూ ఫోర్క్ తో. గుచ్చుతూ ఇంకా కోపం చల్లారాక నీ రక్తం తాగుతారా అంటూ అతని గొంతు నుండి వచ్చిన రక్తాన్ని తాగాడు అజయ్.
అలా గుచ్చుతునే ఉన్నాడు చనిపోయేవరకు. విజయ్ చనిపోయాడు అని తెలిశాక అప్పుడు అవేశం తగ్గిన అజయ్ ఆలోచించడం మొదలు పెట్టాడు. అయ్యో అనవసరంగా చంపాను అయినా నేను తప్పు చేయలేదు ఇలాంటి వాడు ఎప్పటికైనా ఎవరికైనా ఇబ్బందే కాబట్టి వీడిని వెతికే వాళ్ళు కూడా ఎవరూ లేరు కాబట్టి ఇక్కడే పూడ్చి పెడతాను అని అనుకొని. గోతి తీసి ఒక్కడే విజయ్ నీ ఆ గోతిలో పూడ్చి ,అక్కడ పార్టీ జరిగినట్టు ఉన్నవన్నీ మాయం చేసేసి ఎప్పటిలా ఇంటికి వెళ్లిపోయాడు తృప్తిగా….
ఇక విజయ్ ఎప్పటికీ రాడు.అజయ్ ఎవరికీ చెప్పడు. ఇలా ఈ కథ ముగిసిపోయింది. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే విజయ్ అజయ్ నీ చంపవచ్చు లేదా ఇంకేదైనా చేయొచ్చు, అదే పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అజయ్ పరువు పోవచ్చు, గుట్టుగా ఇంట్లో ఉన్న భార్య నలుగురి లోకి వస్తె తట్టుకోలేక పోవచ్చు, ఆ అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్యా చేసుకోవచ్చు. కానీ అజయ్ చేసిన తప్పు ఎప్పటికీ ఎవరికీ తెలియకుండా ఉంటుందా, అతను మనశ్శాంతిగా ఉండగలడా? సమాధానం లేని ప్రశ్నలు…
(నిజానికి ఇది కర్ణాటక లో జరిగిన నిజమైన కథ ఇందులో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు అతను వీడియో తీశాడు. పోలీసులు హంతకుడు ను పట్టుకున్నారు. ఆ సంఘటన ఆధారంగా రాసిన కథ )
-భవ్యచారు