తాపం
అది ఒక గిరిజన ప్రాంతం.అక్కడ ప్రకృతి అందాలు సౌమ్యదాయకం. అక్కడ కష్టం మీద బతికి నివసిస్తూ ఉండేవారు. ఆ గిరిజన ప్రాంతంలో అక్కడ కొండగిరి లో గీత అని ఒక పాప ని చూస్తూ ఉండేది. మా పాపకి అన్న గాని , చెల్లి గాని ,తమ్ముడు గాని, ఎవరూ లేరు ,పాపం అనాధ.
కొండగిరికి దగ్గరలోని కొండగట్టు అనే ఊరు ఉండేది.అక్కడికి ఒక మంచి ఆఫీసర్ వచ్చారు.ఆయన అన్యాయం, ఆధర్మం అనేది చూడలేరు. తప్పు చేస్తే ఎవరికయిన శిక్ష వేసేవారు. మరియు చంప చెల్లుమనిపించేవారు.
అతనికి ఒక కుమారుడు. ఒక రోజు అనుకోకుండా ఆ ఊర్లో అడవిలోనే డ్యూటీ చేస్తూ ఉండగా అనుకోకుండా ఒక పెద్ద పులి వచ్చి ఆఫీసర్ గారిని తన పంజాతో కోట్టి తినబోతుంది. ఇంతలో అక్కడికి గీత అనే పాప వచ్చి అక్కడ అతనికి ప్రాణాలు రక్షిస్తుంది.
పరుగులు తీసి పరుగులు తీసి వెళ్లి ఒక ఒక పెద్ద గోతిలో దాన్ని మునిగేలా చేసింది.. ఆఫీసర్ ప్రాణాలు హాయిగా ఉన్నాయి. ఆఫీసులో వెంటనే గీతను గుడికి తీసుకువెళ్లి అర్చన చేయిస్తాడు.
వస్తూ వస్తూ ఉండగా దారిలో తనకి ఆనందంతో ఇంటికి తీసుకువెళ్లి కొండగట్టు వద్ద సంతోషంగా గంతులు వేస్తూ గీతనే ఇంట్లోనే ఉంచుతున్నారు.
ఏళ్లు గడిచాయి ఆఫీసర్ చనిపోయారు. దాంతో ఆయన కుమారుడు గీతను చదివించి, ఒక డాక్టర్ని చేసి చక్కగా తీసుకువచ్చాడు.
చివరకు ఆఫీసర్ కుమారుడు మన హీరో సుమన్ ఎవరు పెళ్లి చేసుకునే కన్నా గీతను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది నేను నిన్ను చదివించాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకోసం నేను హృదయం తాపం పడ్డాను.
నీకు వయసు వచ్చింది నాకు పర్వాలేదు ఒక తోడు కావాలి. కనుక నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకు ఆశగా ఉంది అని చెప్పేసరికి బంతిపూల సిగ్గు పడుతూ మొగ్గలా మారిన గీత ఒప్పుకుని గబాలున తన పాదాల కడ వాలిపోయింది.
గీత రాంపురం అనే జిల్లాకి డిఎంహెచ్వో అయింది దీంతో సుమంత్ వివాహం చేసుకుంది.
చక్కగా వారి కాపురం నిండు నూరేళ్లు సంతోషంగా గడిపారు. సుమన్ హృదయ తాపం గీతతో తీరింది. మరియు ఒక గిరిజన అమ్మాయిని వేరే కులస్తులు చక్కగా పైకి తీసుకుని వచ్చే చదివించి పోషించి పెళ్లి చేసుకున్నాడు. మరియు తన కోసం ఆగి జీవితాన్ని ప్రాణంగా పెట్టాడు.
లోకంలో ఎటువంటి రోజులు ఉన్న ఇటువంటి రోజులు మనం చూడడం అరుదు.