తళుక్కుమన్న జ్ఞాపకం
అమ్మ నూ మర్చిపోలేము
అమ్మ జ్ఞాపకాలనూ మర్చిపోలేం
కన్నీటి మాటున గుర్తుకొస్తుంటుంది
తలనిమిరి అదృశ్యం అవుతూ ఉంటుంది
ఆ దృశ్యాన్ని దాచుకోవటమెంత అదృష్టం
పలకరింపుగానో చిరునవ్వుగానో
చిరుగాలిలా ఓ రాత్రివేళ నీ భుజం తడుతుంది
ఉలిక్కిపడి బాల్యంలోకి వెళ్తావు
గోరుముద్దలు,బుడి బుడి అడుగులేకాదు,బోల్తాపడిన ప్రతిసారీ
మొదటి భరోసా తనదే
అమ్మను గుండెల్లో ఎలా దాచుకుంటాం
తను పంచిన ప్రేమను
గుర్తుంచుకుని
తను చూపిన మానవత్వపు దారిన
నడవగలిగితే
అమ్మ ప్రేమను అందించగలిగితే
అదే మనం ప్రకటించే నివాళి
వేకువ కోయిల చెవిలో చెప్పింది..
-సి.యస్.రాంబాబు
అమ్మను గురించి బాగా వ్రాసారు.