తల్లులే నవసమాజ నిర్మాతలు
తల్లులే నవసమాజ నిర్మాతలు.
బిడ్డలకు తల్లే మొదటి గురువు.
ఆ తల్లి మాటలే వింటాడు బిడ్డ.
బిడ్డకు ఆ తల్లి మాటలే ప్రేరణ.
జిజియా బాయి మాటలే శివాజీ
మనసులో దేశభక్తిని నింపాయి.
అంత శక్తి ఉంది తల్లి మాటల్లో.
చిన్నప్పుడే
పెద్దలను గౌరవించటం నేర్పాలి.
ఆడవారితో సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని బిడ్డకు నేర్పాలి.
ఉగ్గుపాలతో సంస్కారం నేర్పితే
ఆ బిడ్డ సమాజానికి ఆదర్శంగా
నిలుస్తాడు. లేకపోతే
మొక్కై ఒంగనిది మానై ఒంగునా అని సామెత
నిజం అవుతుంది.
పిల్లలకు పాపభీతి,
దేశభక్తి, సంస్కారం
నేర్పే అమ్మలు ఉన్నంత
వరకు సమాజం బాగుంటుంది.
బాధ్యత అమ్మ చేతిలో పెట్టుకుని సమాజాన్ని నిందిస్తే లాభంలేదు. సమాజం నిర్మించేది అమ్మే. ఆ శక్తి
అమ్మకే ఉంది. వరాలు
ఇచ్చే అమ్మే బిడ్డలను
శాసించగలదు.
-చలసాని వెంకట భాను ప్రసాద్
తల్లలందరికీ వందనములు.