తల్లీ వందనం
పల్లవి
జననీ నీకు వందనం
మా ఊపిరి నీవే
ఈ దేహము నీదే
నీకే అంకితమూ మాఈ జన్మ
చరణం
యోధులు నడచిన నేల ఇది
శాంతి అహింసల ఆలయము
బంగరు భూమి మా దేశమ్మే
నీ ఆదేశముకై చూసెదము
చరణం
విద్వేషాలే పెరిగినవమ్మా
మాలో మార్పును కలిగించమ్మా
కులము మతము ప్రాంతము పేరున
కాట్లాడువారే పెరిగితిరమ్మా
చరణం
మన సంస్కృతినే మరచినవారికి
మార్గము చూపి మనసే మార్చు
అందరు ఒకటేయని
సోదరభావము మాలో పెంచు
-సి.యస్.రాంబాబు
పాట బాగుంది👌👌👌👌
అద్భుతం సార్ పాట చాలా బాగా రాసారు 👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐