తల్లి-తండ్రులు
కన్నతల్లి అనే పదాన్ని వర్ణించటం ఈ భూమి మీద మానవమాత్రులకి, అ భగవంతుడికే సాధ్యం కాదు.
నవమాసాలు మోసే ఆడపిల్ల తన జీవితం చివరి వరకు పడే కష్టం మొత్తం అప్పుడే అనుభవించి ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక జీవికి జన్మనిస్తుంది. పుట్టే పిల్లలు ఎలాంటి వారు అయినా మానవమృగాల సమాజం నుంచి తన పిల్లల్ని కాపాడుకుంటూ జీవితం అంతా ధారపోసే తల్లి అనే పదానికి వర్ణణ ఇవ్వలేము. మనల్ని పుట్టించి పెద్దవాళ్ళని మంచి వాళ్ళని చేయటానికి శ్రమిస్తున్న నిత్య కార్మికురాలు తల్లి. అ తల్లికి శోకం తెప్పిస్తే నీ జన్మ కి అర్ధం లేదు. అ తల్లి(ఆడపిల్ల) ని చెరపట్టే మానవమృగాల జీవితం ముగించేందుకు మరణశాసనం రాయండి మానవత్వం కలిగిన మానవుల్లారా…..
ప్రేమ అనే పదానికి ప్రతిరూపం నాన్న
నా పుట్టుక కి కారణం నాన్న
నా ఊపిరి కి కారణం నాన్న
ప్రతి నిత్యం నన్ను కాపాడే కవచం నాన్న
నాతప్పు ని సరిద్దిదే ఉపాధ్యాయుడు నాన్న
ఏమి చేసిన నీ ఋణ తీర్చుకోలేము నాన్న
– సూర్యక్షరాలు