తల్లి ప్రేమ, తపన…

తల్లి ప్రేమ, తపన

 

తల్లి ప్రేమ గురించి అందరికీ తెలుసు… కానీ తల్లి భాదల గురించి, మరో తల్లికే తెలుస్తుంది..

అమ్మతో తొలి అనుభవాలను, తనకు పుట్టిన పిల్లని చూసి తన అమ్మతన్నాని, స్రవంతి మాటల్లో…

నా తొలి చూపు అమ్మవైపు
నా తొలి పలకరింపు అమ్మతో
నా తొలి నవ్వు అమ్మకోసం
నా తొలి ఆట అమ్మతో
నా తొలి మాట అమ్మ
నా తొలి అడుగులు అమ్మకేసి
నా తొలి ప్రయాణం అమ్మతో
నా తొలి ఆనందం అమ్మతో
నా తొలి బాధ అమ్మతో
నా తొలి భయం అమ్మతో
నా తొలి కన్నీరు అమ్మకై
నా తొలి కోరిక అమ్మతో
నా తొలి అక్షరం అమ్మ
నా తొలి మొక్కు అమ్మకే
నా తొలి మొక్కు అమ్మకై
నా తొలి ప్రేమ అమ్మ
నా తొలి ముద్దు అమ్మకే
నా తొలి చీర అమ్మది
నా తొలి గురువు అమ్మే
నా తొలి గెలుపు అమ్మకై
నా తొలి జీతం అమ్మకే…

కొన్ని సంవత్సరాలు తరవాత…

నా తొలి కాన్పు అమ్మే!!!నా తొలి చూపులు ఆ చిన్ని అమ్మ వైపేనా తొలి అమ్మతనం ఇక ఈ అమ్మకే….అమ్మతనం ఒక గొప్పటి వరంఎంతమంది పిల్లలున్న ప్రేమను సమానంగా పంచే గుణం ఒక్క అమ్మకే చెల్లు.అమ్మని కనగలిగే శక్తి, మళ్లీ ఓ అమ్మకే చెల్లు…
……

నా చిట్టి తల్లిని వొడిలో పెట్టుకుని నేను మా అమ్మ ఒడిలో పడుకుని.అమ్మ రేపటినుంచి నేను ఆఫీస్ కి వెళ్లిపోవాలి లీవ్స్ అయిపోయాయి.. ఇంక నా బుజ్జి తల్లిని నేను రోజంతా చుస్కొలేను అమ్మ.. అంటూ బాధపడుతున్నాను.. అవును అమ్మ నన్ను నువ్వు ఎపుడైనా ఇలా వొదిలి వెళ్ళవా?? అని అడిగాను..

అమ్మ నవ్వుతూ లేదు నేను నీలా ఉద్యోగం చెయ్యలేదు కదా.. అయిన నువ్వే నన్ను వొదిలి వెళ్ళావు.. చదువు అని, ప్రోజెక్ట్ వర్క్ అని, ఉద్యోగమని తరవాత పెళ్లని.. కానీ నేను ఎప్పుడూ నిన్ను వొదిలి వెళ్ళలేదు అంది అమ్మ కళ్ళు తుడుచుకుంటూ…

అవును అమ్మ నేనే వెళ్ళాను నువ్వు ఎప్పుడూ వెళ్ళలేదు మరి నేనలా వెళ్ళినప్పుడు నీకెలా ఉండేది అని అడిగాను..ఒక్కోసారి పెద్దదానివి అయ్యవనే సంతోషం మరోసారి అప్పుడే ఎదిగిపోయావనే బెంగా రెండు వుండేవి.. నువ్వు వెళ్లి జాగ్రత్తగా ఇంటికి వచ్చేదాకా అలా చూస్తూ వుండేదాన్ని అంది..మరి పెళ్లి అయిన్నప్పుడు నేను పెద్దదాన్ని కదా అప్పుడు ఏమనిపిచింది అని అడిగాను…

అమ్మ నవ్వి పెళ్లపుడే కాదు నీ వొళ్ళో నీ పిల్ల వున్నా నువ్వు నాకు పిల్లవెనే.. నువ్వు ఎంత ఎదిగినా నేను నీకు అమ్మనే కదా అంది..చిన్నతనం నేను అమ్మతో వున్నపుడు అమ్మ పడ్డ భయాలు, ఆ ప్రేమ నాకు చాదస్తం గా అనిపించేవి ఇప్పుడు నా కూతురుని చూస్తుంటే అవ్వనీ తెలుస్తున్నాయి.. అనుకున్నా..

సరే మరి రేపు నేను రోజంతా దీనికి కనపడక పోతే ఏడ్డుస్తుందంటవా అని అడిగాను…నువ్వు చిన్నపుడు నన్ను వొదిలేసి వెళ్తే నేను ఏడ్చాను నువ్వు కాదు… ఇపుడు నువ్వు బాధపడాలి ఇది నాతో ఆడుకుంటుంది అంది నవ్వుతూ..ఆ మాటకి నాకు నవ్వు దాంతో పాటు బాధ వచ్చాయి..పోనీ జాబ్ మానేసై అంది అమ్మ..

అమ్మో మానేస్తే ఆయన జీతం తో దీన్ని పెంచడం చదివించడం ఈ రోజులో చాలా కష్టం అమ్మ.. ఇది బాగా చదువుకోవాలిఅంటే నేను ఈ బాధ బరించాల్సిందే… అని పిల్లని దగరకి తీస్కుని ముద్దు పెట్టుకున్నా…అది విన్న అమ్మ ఏమిటో ఈ కాలపు చదువులు జీవితాలు అంటూ సరే పడకో పొద్దున్న వెళ్ళలిగా అంది..అలాగేలే ఉండమ్మా రేపు నేను వెళ్ళేటప్పటికి బజ్జిది లేవదు కాసేపు ఆడుకుంట అన్నాను…సరే ఆడుకో అంటూ అమ్మ వెళ్లి పడుకుంది..నేను కాసేపు ఆడుకుని పాలిచ్చి పడుకోపెట్టా.. నేను పడుకున్నాను.
తెల్లారింది పాప ఏడుస్తుంటే లేచి పాలిచ్చి అలా కూర్చున్న..

ఆయన వొచ్చి రెఢీ అవ్వు దింపుతా ఆఫీస్ లో అన్నారు..నేను వెళ్ళను. దీంతో వుండాలని వుంది అన్నాను…ఆయన నవ్వి, అప్పుడు నిన్ను ఇంక ఆడుకో మేము వేరేవాళ్లని పెట్టుకుంటాం అంటాడు మీ బోస్ అన్నారు..ఇంక చేసేది లేక లేచి రెఢీ అయ్యి బాయిలుదేరాను…దారిలో పిల్లలని చూసిన, ఏడుపు విన్న నా తల్లే గుర్తొస్తోంది.. మొత్తానికి చాలా నెలల తరువాత ఆఫీస్ కి వెళ్ళాను అందరితోనూ మాట్లాడాలి పని తెలుసుకోవాలి ఇంతలో పాపకి పాలు ఇచ్చిందో లేదో అమ్మ అని ఫోన్ చేశాను..ఇచ్చాను అని చెప్పింది..ఏడుస్తోందా నేను లేనని అని అడిగాను..

హాయిగా ఆడుకుంట్టోంది నువ్వు పని చూసుకో అని చెప్పింది అమ్మ…అలా మధ్యాహ్నం అయింది అన్నం తింటూ వీడియో కాల్ చేసి పిల్లని చూస్కుంటు కూర్చున్నాను…
సాయంత్రం ఎప్పుడవుతుంది ఎప్పుడు దాన్ని ఎత్తు కోవాలి ఇదే ఆలోచన…మొత్తానికి టైమ్ అయింది గబగబా గేటు దెగ్గరకి వెళ్ళాను ఆటో ఎక్కి ఇంటికెళ్ళి పిల్లని ఎతుకున్న..
ఎదో ఆనందం ఎన్నో రూజులైనట్టు వుంది..ఇంతలో ఆయన వచ్చి ఎంటి ఆ బాధ నేను ఇవాళ ఇంట్లోనే వున్న మి అమ్మగారు ఇక్కడే ఉన్నారు అయిన ఎందుకు అంత కంగారు అని అడిగారు…దానికి సమాధానం.. నాకు, అక్కడ పాల సీసా తో నిలబడ్డ మా అమ్మ ఇంకా నాలా ఎంతో మంది అమ్మలకి మాత్రమే తెలుసు…

తల్లి ప్రేమ అన్నంతం, కానీ తల్లి భాధ మమేకం(తనలోనే దాచుకోవడం)

-శ్రీ కిరణ్

0 Replies to “తల్లి ప్రేమ, తపన…”

  1. తల్లి ప్రేమ గురించి చాల చక్కగా వ్రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *