తల్లి మనసు
ఈ క్షణం..
నా చూపు ఎవ్వరికి కానరాని ఆకుల చాటునా….
సూరన్న కొద్దికొద్ది కిరణాలు..
చంద్రన్న అంతా అద్దె వెన్నలు..
ఏటుచేసిన కోమ్మల చాటున ఆకాశమే..
వంగే….
విరగని…
ముళ్ళు ఎరుగని…
నోటికి అనువైనవి…
బరువుకి తెలికైనవి…
మెత్తని పుల్లలు…
పొడువైన..
పాన్నపుకి సరియినా…
ఎండి ఎండనివైన..
నూగు లేని పచ్చి వరి గడ్డి….
నిర్మాణానికి మా అమ్మ యిచ్చిన అనుభవం చాలు…
సోగసులు అద్దడానికి నాలో ఉన్న పరిణితి చాలు…
అది చాలని వేళ ప్రయత్నించే నా మనసు చాలు..
కట్టిన గూటిలో నా బుజ్జి పిల్లలు…
ఒకదాని రంగు నాదే…
మరొకదాని మొహం నాదే…
ఎన్ని ఎలా వున్న అన్ని నా పిల్లలే….
ఆనందమో..,,
సంతోషామో..,
సంబరమో..,
తెలియదు నాకు…
నా రెక్కల మాటున దాగి..,ఈ ప్రపంచాన్ని..!
అవి చూసే చూపులు…
అమాయకపు అందాలు..
అవి చేసే శబ్దలు..
స్వచ్ఛమైన సంగీతం…
అవి చేసే చేష్టలు..
నా కళ్ళు తిప్పుకోలేక మనసున నిలిచే జ్ఞాపకాలు…
రెక్కలు రావాలి..
రక్షణ పొందాలి…
రాత్రి, పగలు తేడా తెలియాలి..
ఆకలి విలువ తెలుసుకోవాలి…
ప్రకృతి పద్ధతులు నేర్చుకోవాలి…
అన్ని రోజుల్లో ఒకేలా ఉండాలి…
ఇవన్నీ నా కాలంలో భాద్యత గా వాటికీ నేను నేర్పించాలి…
– టింకు.ఎస్