తకరారు
ఇంటి పట్టున ఉన్నా
ఏకాకినే సమూహంలో
ఉన్నా ఒంటరినే
దినచర్యలు నడుస్తున్నా
దిక్కుతోచని పక్షినే !
సూర్యచంద్రుల దిశలు
మారుతున్నా తిమిరంలో
మగ్గుతున్న పెను చీకటినే!
మనసుకు దేహానికి
మధ్య జరిగే ఎడతెగని
తకరారులో రోజులు
మారుతున్నాయి !
వత్సరాలు గడుస్తున్నాయి!
సుదీర్ఘ నిర్విరామ పయనంలో
కాయం కదులుతూనే ఉంది !
అందులో లేనిది ఒక్కటే ప్రాణం!
తకరారు: చిన్న గొడవ.
-మామిడాల శైలజ