తగ్గించు

తగ్గించు

అర్జున్ ది మామూలుగా ఉన్న చిన్న కుటుంబం , తానూ, తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ళు తో సంతోషంగా సాగిపోయే కుటుంబం.
అయితే అర్జున్ కి ఒక చెడు అలవాటు ఉంది ఎవరినైనా ఇట్టే నమ్మడం అలాగా అలాగే మొహమాట పడడం. ఆ మొహమాటం వల్ల అతను స్నేహితులకి చాలా అప్పు ఇచ్చాడు.

అర్జున్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమే ఆయన అతనికి వచ్చే జీతం సరిపోదు అయినా కూడా స్నేహితులు అడగగానే వాళ్లకి ఏ కష్టం వచ్చిందో అని ఆలోచించి మొహమాటం పడుతూ ఇచ్చేవాడు కానీ అడగడానికి అతనికి అదే మొహమాటం అడ్డుగా వచ్చేది.

ఇలా మొహమాటపడుతూ స్నేహితులను నమ్ముతూ చాలావరకు అప్పులు ఇచ్చాడు. అయితే అడగాలంటే మొహమాటం అడ్డు రావడంతో తను ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే అడగకుండా ఉండేవాడు.

అడిగితే ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో బాధపడతారనేమో అని అడగకుండా ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి తను ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ఏ స్నేహితులని కూడా అడగడం లేదు.

అలా ఒక రోజు అతని తండ్రికి హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. అతని చేతిలో పైసా లేదు ఎలా ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అతనికి స్నేహితులు గుర్తుకు వచ్చారు. వాళ్ళందరికీ ఫోన్లు చేసి అర్జెంటుగా డబ్బు కావాలని అడిగాడు మొహమాటపడుతూనే. కానీ ఆ స్నేహితులు అయ్యో ఇప్పుడు లేవురా, మాకు ఏమో పనులు ఉంటే ఖర్చు చేసాం ,అంటూ తప్పించుకున్నారు .తప్ప ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదు.

అర్జున్ కి ఏం చేయాలో అర్థం కాలేదు తన మొహమాటం అడగకుండా ఉండడం వల్ల ఇప్పుడు తానంత ఇబ్బంది పడుతున్నాడు తన తండ్రిని ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతూ ఉన్న సమయంలో అతని అక్క చెల్లెలు వచ్చి తమ్ముడు చేతిలో డబ్బులు పెట్టి అన్నయ్య ముందు నాన్నగారిని బాగు చేయిద్దాం. తర్వాత విషయం చూసుకుందాం అని అన్నారు..

ఇక అర్జున్ అక్క చెల్లెల ముందు తలదించుకుంటూ ఏడవసాగాడు తమ్ముడు నీ మొహమాటం నీ నమ్మకం వల్ల ఇంతవరకు వచ్చింది. ముందు దాన గారికి బాగా అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బులు వసూలు చేయాలో మేము చూసుకుంటాం, నువ్వు ఈ మొహమాటాన్ని వదిలేసేయ్ అని చెప్పారు. దాంతో అర్జున్ తన తండ్రిని హాస్పిటల్కి తీసుకువెళ్లి గండం కట్టి ఎక్కించేలా చేశాడు.

ఆ మరుసటి రోజు అక్క చెల్లెలు అర్జున్ స్నేహితుల ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ అడ్రస్లు కనుక్కొని డైరెక్ట్ గా ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి డబ్బులు అడిగారు. వాళ్లు అనుకోని ఈ చర్యకు ఆశ్చర్యపోయి ఏం చేయాలో తెలియక వెంటనే ఇచ్చే డబ్బులతో పాటు వడ్డీలు కూడా ఇచ్చేశారు.

వాళ్ల స్నేహితుల భార్యలు ఆడవాళ్లు ఇంటికి రావడంతో ఏంటి మీరు ఆడవాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకుంటున్నారా అంటూ దెప్పిపొడవడం తిట్టడం చేసేసరికి అందరి దగ్గర డబ్బులు వసూలు అయ్యాయి.

అలా అర్జున్ ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ తన స్నేహితులని అతిగా నమ్మడం మొహమాటం అనేది తగ్గించుకో వాలని. నిర్ణయించుకున్నాడు.

తన మొహమాటం వల్ల ఎంత డబ్బులు కోల్పోయేవాడు అర్థం చేసుకొని ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాడు అక్క చెల్లెలు కూడా అదే తమ్ముడు నువ్వు మొహమాటం పడకుండా నీ స్నేహితులు ఎప్పుడైనా డబ్బు అప్పుగా అడిగితే డైరెక్ట్ గా లేవని చెప్పు అంతే తప్ప మొహమాటానికి పోయి డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడకు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉంటే సరికి నాన్నని రక్షించుకున్నాం. అదే డబ్బులు లేకపోతే ఎంత పెద్ద సమస్య అయ్యేది అంటూ హెచ్చరించారు. దాంతో అర్జున్ కూడా సరే అక్క మీ మాట తప్పకుండా వింటాను .అంటూ వాళ్లకి మాట ఇచ్చాడు.

అందుకే ఏ విషయంలోనైనా మొహమాటం పనికిరాదు. మొహమాటాన్ని తగ్గించుకొని ఉండాలి. ముఖ్యంగా ప్రాణం విషయంలోనూ భోజనం విషయంలోనూ మొహమాటం పనికిరాదు. మొహమాట పడితే మనమే నష్టపోయే వాళ్ళం అవుతాం.

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *