Tag: kota aksharalipi

చిత్రం

చిత్రం 1) లోకమందు ఎన్ని లొసుగులున్నను గాని రాజ్యముల చరితలు,రణములన్ని చరిత కానవాళ్ళు చిత్రమే(మై) చూపును రాతిపైన చరిత రాసియున్న 2) చిత్రము కథచెప్పు జీవిత గాథల ప్రకృతి నడకలన్ని పారజూపు కష్టసుఖములన్ని కనులముందుంచును […]

చంద్రవదన

చంద్రవదన చంద్రవదన నిన్ను చూడగా బ్రహ్మయ్య పుట్టునపుడె పసిడి పుటము బెట్టె తేనె లొలుకు అచ్చ తెలుగు అమ్మాయిగా వెలుగుతున్న మోము వేగుచుక్క – కోట

పందెం

పందెం పందెమంటె నాకు పడదు ముమ్మాటికీ ఆత్మ నిబ్బరమ్ము అసలు గెలుపు పందెమాడువాడు పరువు తీసికొనును పరువు పోయెనంటు పయనమాపు – కోట

ఎడారిలో భాణోదయం

ఎడారిలో భాణోదయం కలుగు లోనవున్న కనిపెట్టి తీరును భాణుడున్నచోట బతుకుజీవి అరుణకిరణములతొ ఆదరించీతీరు లోకబాంధవుడతి లోచనుండు – కోట

అనుకోకుండా

అనుకోకుండా డాక్టరవ్వబోయి యాక్టరయ్యానని లోకమనెడి మాట లోకువయ్యె బ్రహ్మ రాసినట్లు బతుకులు మారును మనిషి చేతిలోని మహిమ వలన (గాదు) – కోట

చిత్ర పద్యం

చిత్ర పద్యం ఏడుగడగ తనను ఏలెడి నాథుడు ఎడముకాగ బెదరి ఏడ్పు నాపి ధైర్యమూని.తిరిగి దరిచేరు నాశతో ఎదురు చూచుచుండె ఏలుననుచు – కోట

పాపం పసివాడు

పాపం పసివాడు ఆ.వె 1) అందరాని మిద్దె లాకాశ హర్మ్యాలు     ధనిక వర్గమునకు తగిన డాబు     ఆకలి కడుపులకు అన్నము లేకున్న     పెద్ద మేడ నీడ […]

ఉగాది ఊసులు

ఉగాది ఊసులు 1 ఆ.వె ఉప్పు.తీపి.కారముపకారమును చేయు   చేదు.వగరు.పులుపు చేయు మేలు   ఏవి యెక్కువైన ఇక్కట్లు వచ్చును   మితము ఎప్పుడైన హితము గూర్చు 2 తే.గీ. కలిమి లేములు సంతోష […]

నాలో నేను

నాలో నేను 1) వృద్ధ గురువులంత ఒకచోట చేరగా     పాత జ్ఞాపకాలు పరిమళించె     అయ్యవారలంత ఆయురారోగ్యాల     సాగవలయు శాంతి సౌఖ్యములతొ 2) ఉగ్రవాదమింత ఉగ్రరూపము దాల్చి […]

ఎదురు చూపులు

ఎదురు చూపులు 1)ఉన్నత చదువులకు ఉద్యోగమొచ్చునని బాధలు పడి చదివి భంగపడిరి ఏడువత్సరాలు ఎదురు చూపులెగాని కోర్కె తీరదాయె కొలువు రాక 2) చూపు కన్న ఎదురు చూపులు కష్టమౌ బంధు జనమును కన […]