Tag: kota aksharalipi

ఉప్పెన

ఉప్పెన 1) ఆ.వె.    మనిషి పాపములను మన్నించ లేనట్టి    అగ్గి పర్వతములు భగ్గుమనెను    ఊరువాడ యనక ఉప్పెన మాదిరి    అడవులన్ని కాలి అంతరించె – కోటా

జంట

జంట 1) ఆ.వె.    సంధ్యవేళ యందు సంద్రమందు పడవ    ఊసుపోక జంట ఊసులాడ    ఆకసమున తారలన్ని మెరిసిపోగ    ముద్దు లాడు జంట మురిసి పోయె – కోటా

సీతాకోకచిలుక

సీతాకోకచిలుక 1) ఆ.వె.    సీతాకోకచిలుక సింగారమంతయు    తీయతేనియలను తీసుకొనుట    రంగు రంగు పూల సుగంధముల జాడ    వెదకి వెళ్ళి తాగు వేగిరమున – కోటా

చదువు

చదువు ఆ.వె. రాత్రి పూట చదువు, రాతపనులు వద్దు కళ్ళు దెబ్బ తినును కష్టమగును ఆట పాట చదువు ఆరోగ్యమిచ్చును నిద్రమత్తు చదువు నిండు సున్న – కోటా

వృద్ధుని కష్టాలు

వృద్ధుని కష్టాలు 1 తే.గీ.   చేవ లేనట్టి కాళ్ళకు చేవ కర్ర (చేతి కర్ర)   నడవ లేనట్టి వృద్ధున్ని నడవజేసె   బాధ్యతెంతైన మోయును భారమనక  పొట్ట కూటికి ప్రతిజీవి పోరు […]

వరద బాధలు

వరద బాధలు 1) వదలకుండ వాన వరదలై పొంగెను    వాహనములు తేలె వరదలోన    బురదచేరి సరుకు పనికి రాకుండాయె    ధైర్యమిచ్చువారు దరికిరారు 2) ఇంటనీరుచేరి ఇక్కట్లు మొదలాయె    ఉప్పు […]

ఉపాధ్యాయుడు అంటే

ఉపాధ్యాయుడు అంటే 1) బ్రహ్మ విష్ణు ఈశ బహు రూపు లు గురువు    విశ్వ మంత నిండి విశదపరచు    గురువు గొప్పదనము గుర్తెరింగిననాడు    మానవాళి పొందుమహితసుఖము 2) వృత్తి ధర్మ […]

రైతు

రైతు 1) తే.గీ    గూడు లేకున్న కానల కూటి కొరకు    పోడు గొట్టుచు ముళ్ళతో పోరుసలుపు    పాడి పంటలు పెంపొంద పాటుబడుచు    మాడుచుండెడి రైతు సామాన్యుడగునె! 2) తే.గీ […]

లంచగొండితనం (అవినీతి)

లంచగొండితనం (అవినీతి) 1) లంచమిచ్చుకుంటె లక్షణంబుగ పోస్టు    వచ్చి తీరుతుంది నచ్చినట్లు    ప్రతిభ గలిగి యున్న పనికి రాడు బీద    నెహ్రూ కలలుగన్న నేలయందు 2) బడుగు జీవులెన్ని బలియైన […]

మారిన (మారుతున్న) విలువలు

మారిన (మారుతున్న) విలువలు 1) పదవి లేనినాడు పస్తులున్న చరిత    కొద్దికాల పదవి.కోటి ఆస్తి    ఆక్రమించి భూమి హత్యలు.దాడులు    విలువ మారుచుండె విశ్వమందు 2) పదవి దక్కుకొరకు పార్టీల వారిగా […]