తారాచరణియo మూడో భాగం
జ్యోతి బడికి వెళ్లిందని మాటే కానీ మనసు కుత కుత ఉడుకుతుంది. సాంబయ్య తాత అని దగ్గరికి వెళ్తే ఏంటో ఇలా చేశాడు. రామరాజు మామ నాన్నతో అలా అంటాడా ఛీ ఆడపిల్ల అనగానే అందరికీ లోకువ నే బుగ్గలు పట్టుకొని నొక్కడం ,భుజాలు పట్టుకుని ఉపడం నా చిన్ని వాటిని అబ్బా జామపండు గట్టిగానే ఉందని అనడం వింటుంటే ఏదోలా అనిపించింది. ఏడుపు కూడా వచ్చేది. నాన్న ఏమో కల్లు అమ్మడం మాను అంటే మానడు. ఇలా ఆలోచనలతోనే చదువెం బుర్రకు ఎక్కనే లేదు. ఎలాగో బడి అయ్యింది.
మధ్యాహ్నం ఏదో తిన్నట్టు తిన్నది అమ్మ కట్టిన డబ్బా, ఇవన్నీ ఆలోచిస్తూనే సాయంత్రం ఇంటికి బయలుదేరింది. ఇంటికి వచ్చాక జ్యోతి ముభావంగా ఉండడం చూస్తూ తల్లి ఏదో అయ్యిందని గ్రహించి ఎంటే జ్యోతి ఎవరైనా ఏమైనా అన్నారా ,అంటూ అరాగా అడిగింది. నులక మంచం పై కూర్చున్న దాసు ఆ ఏం లేదు లేవే పొద్దున ఆ రామరాజు గాడు ఏదో కుసాడు అందుకే గది అట్లుంది అన్నాడు. అవునా వాడికెం రోగం పిల్లను చూస్తే సలు కళ్ళలో నిప్పులు పోసుకుంటారు ఏదవలి అంటూ తిట్ల దండకం అందుకుంది జయమ్మ.
ఇవన్నీ వింటు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని అన్నం తిని రాసుకుంటూ కూర్చింది జ్యోతి ఇదంతా తనకు మామూలే అన్నట్టు. కానీ చేతులు రాస్తున్నాయి బుర్రకు ఏమీ ఎక్కడం లేదు. ఏదో జరగబోతోంది అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఏం చేయాలో తెలియని స్థితి. తనకే ఉయెందుకు ఇలా తన తోటి ఆడపిల్లలు కూడా ఇలాగే మాట్లాడుకుంటారు. ఎవడో ఏదో అన్నాడని ఎవడో బుగ్గలు గిల్లాడు అని చీ ఏం మనుషుల్లో ఏమో అనుకుంటూ ఆ రాత్రి కి అమ్మ తిడుతూనే వండిన అన్నాన్ని తిని నిద్రపోయింది జ్యోతి.
*************
సాయంత్రం అవుతున్న. ఇక ఇంటి కి రాని చరణ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నది లక్ష్మి. కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న భార్యని చూస్తున్న పద్మ య్య ఏంటే ఏమైంది ఎవరికోసం ఎదురు చూస్తున్నావ్ అంటూ అడిగాడు నేను ఇంకా ఎవరి కోసం ఎదురు చూస్తాను నీ పెద్ద కొడుకు కోసం ఇంకా ఇంటికి రాలేదు ఈ పాటికి వచ్చే వాడే ఇవాళ ఎందుకు పొద్దున గొడవపడి వెళ్లినప్పటి నుంచి నా మనసంతా వాడి పైనే ఉంది ఇంకా ఇంటికి దిక్కులేదు నిజంగానే అన్నంత పని చేశాడు నాకెందుకో భయంగా ఉంది . అలా వెళ్లి చూసి రావయ్యా అంటూ భర్తనే ప్రతి లాడింది లక్ష్మి.
ఇది మరీ బాగుంది మీరు మీరు మాట్లాడుకుని పోట్లాడుకొని మధ్యలో నన్ను రమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడ ని వెతకాలి ఊరంతా చుట్టాలే ఎవరింట్లో తొంగున్నాడు నేను ఎక్కడని వెతకను నీ చిన్న కొడుకు ని పంపించు అన్నాడు.
వాడు ఇంకా ఇంటికి రాలేదు అయ్యా ఏదో రాసుకునే పని ఉందని దోస్తు ఇంటికి వెళ్ళాడు అందుకే నిన్ను వెళ్ళను అంటున్న లక్ష్మి. అయినా వాడు అడిగింది మీరు విన్నారు కదా ఏదో ఉద్యోగం చూసుకోరా పని నేర్చుకోవాలి అంటే పని నేర్చుకొని బిజినెస్ చేస్తా అంటూ డబ్బులు ఇవ్వు అంటున్నాడు అదేదో మీరు చూసుకోండి. మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకునే దానికి మధ్యలో నా మనసు పాడు చేస్తారు నన్ను ఆందోళనకు గురి చేస్తారు అటు వాడికి చెప్పలేక ఇటు నిన్ను అడగలేక మధ్యలో నేను గింజుకుంటున్న మరి మరి అడిగినా ఏదో ఇచ్చేస్తే అయిపోతుంది కదా అంటూ భర్తని ఆరా తీస్తుంది లక్ష్మి.
ఆ ఇక్కడ కట్టుకుని కూర్చున్నా మరి చేస్తా వాడు అడగగానే సందు లోంచి తీసి చేతిలో పెడతా తీసుకొచ్చి ఇస్తా నీ అయ్యా నీ అయ్యా మూతలు కట్టబెట్టిన ఆస్తులు మూలుగుతున్న ఇంట్లో తెచ్చిస్తా అంటూ లోపలికి వెళ్లిపోయాదు పద్మయ్య.
వేషాల కేంద్రక లేదు నా అంత ఉన్నాడు అయితే నీకెందుకు కట్టబెట్టాడు ఇంకో మనిషిని చూసి జమీందారు కట్టుకునేదాన్ని బాగానే ఉంది పరాస్ కం . నువ్వు ఇట్లా వాడు అట్లా ఏం చేస్తా ఉన్న బంగారం వేసుకొని గా మిగిలింది ఇస్తా నా బతుకు కు చచ్చేదాకా బంగారం వేసుకుని తిరిగే భాగ్యం లేదేమో అంది.
వాడు బాగుపడితే అంతకు రెండింతలు చేయించాడు అంటూ వారే చెప్పిందానికి వత్తాసు పలికాడు పద్మ అంతకన్నా ఏం చేయలేక. అయితే బంగారం ఇచ్చే మంటావా అంటూ అతని మనసులో ఏముందో తెలుసుకోవడానికి అడిగింది. ఆ మరి ఈ మని అంటున్నా ఇంకా వేరే దారి లేక పోయే దారిలో నడిస్తే నా పిల్లలు కూడా అదే దారిలో నడవాలని ఏం లేదు కదా ఇష్టాలు వాళ్ళవి.. వాడికిష్టమైన పనిచేయని మధ్యలో మనం కంటావు ఎందుకు దిగితేగాని లోతు తెలియదు చూద్దాం ఎంతవరకు నెట్టుకొస్తున్నాడు అంటూ తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్పి నిన్న కప్పుకొని పడుకున్నాడు పద్మ య్యా.
అనుకున్న వాడు పొద్దున్నే నా బంగారం కు రెక్కలు వస్తాయని ఎప్పుడో అనుకున్నా , అయ్యా కొడుకుల కన్ను నా బంగారం మీద పడ్డది దేనికైనా పెట్టి పుట్టాలి చేసుకునే యోగం కూడా ఉండాలి అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది లక్ష్మి. అదే సమయంలో…
**********
ఊరి చివర పొలాల మధ్యలో కూర్చున్నాయి దోస్తుల తో మందు తాగుతున్న చరణ్ తో ఇంకో దోస్తు భాస్కర్ ఏమిరా చరణ్ గా ఏదో బిజినెస్ పెడతా అంటూ తిరిగిన ఎంతవరకు వచ్చింది అంటూ అడిగాడు.
ఒప్పో భాస్కర్ బిజినెస్ పెట్టడం గానే పైసలు ఎవడైనా ఉన్నాడా మనకు ఎవడు ఇస్తాడు మనం చదివే చదువు రూపాయి కూడా ఉంటది ఉన్న ఊర్ల ఎవర్ని అడగాలో అర్థం అయితలేదు. మా అయితే బెదిరించినా గాని ఇస్తారన్న నమ్మకం లేదు పోయి మా ఇంటి దగ్గర పని నేర్చుకొని రోజు సతాయిస్తుంది అన్నాడు బాధగా చరణ్ .
అయితే మరి ఏం బిజినెస్ పెడతావ్ రా ఒకవేళ మీ నాయన డబ్బిస్తే అంటూ అడిగాడు రాజు. ఏమో నాకైతే ఏందీ వస్తలేదు చూడాలి ఏ బిజినెస్ పెడితే మంచిగా ఉంటది. ముందు అయితే పైసలు రాణి. అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు.
అయితే ఇది రాత్రికి ఇంటికి పోలేదా మల్ల అన్నాడు భాస్కర్. ఆగిన తాగి ఇంటికి పోతే మామ సంపదే చంపుతుంది. గిన్నే పంటా అంటున్న చరణ్ తో ఈ పొలం లవ్ అంటే పవన్ అన్న గరగల మా ఇంటికి పోదాం పా అన్నాడు భాస్కర్.
గట్లనే అన్నా అంటూ అందరూ కలిసి ఇంటి వైపు అడుగులు వేశారు.. ఇంతకీ చరణ్ ఏం బిజినెస్ పెట్టబోతున్నాడు దానికి లక్ష్మీ బంగారం ఇస్తుందా ? ఇవ్వదా ? తదుపరి భాగంలో తెలుసుకుందాం.
– భవ్యచారు