తారా చరణియం పరిచయం

తారా చరణియం పరిచయం

ఒక సోషల్ మీడియాలో నా రచనలు చదివి, ప్రభావితం అయిన ఒక చెల్లి పరిచయం అయ్యింది. అక్కా అంటూ ఆప్యాయంగా పిలిచింది. నా ఫోన్ నంబర్ అడిగింది.

నేను ముందు అనుమనించాను ఎందుకంటే ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. అందుకే రేపు, మాపు అంటూ జాప్యం చేస్తూ వచ్చాను.

నేను మాట్లాడక పోయినా తను రోజూ మెసేజ్ చేసేది. రోజూ ఏవేవో చెప్పేది. తన జీవితం గురించి తన కుటుంబం గురించి ఎన్నో మాటలు నాతో పంచుకునేది. తన పర్సనల్ విషయాలు కూడా నాతో చెప్పేది. నాకు తన విషయం చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది.

తన గురించి ఇంకొంత తెలుసుకోవాలి అని అనుకుంటూ సరే ఏదైతే అది అవుతుంది అని నా నంబర్ ఇచ్చాను వారం తర్వాత. తను హాయ్ అక్కా అంటూ సందేశం పంపింది. నేను మాటలు కలిపాను.

తను ఎంతో ప్రేమగా మాట్లాడేది. మాటల్లో తనకు ఎవరు లేరని తెలిసింది అంటే తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరు లేరు. తనది ప్రేమ వివాహం అని, అది కూడా తానే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అంటూ చెప్పింది.

ఇది నాకు కాస్త వింతగా అనిపించింది. ఎక్కడైనా అబ్బాయిలు ప్రేమిస్తారు. వెంట పడతారు కానీ అందుకు భిన్నంగా అమ్మాయి వెంట పడడం, ప్రేమించడం పెళ్లి చేసుకోవడం కాస్త వింతగా అనిపించింది.

తన గురించి మొత్తం తెలుసు కోవాలి అని అనుకున్నాను. అందుకే తన గురించి అన్నీ అడిగాను. తను సంతోషంగా అన్ని విషయాలు నాతో చెప్పుకుంది. తన పర్సనల్ విషయాలు అన్ని ఏది విడిచి పెట్టకుండా అన్ని చెప్పేసుకుంది.

నన్ను తన అక్కలాగా అమ్మలాగా భావించి నాతో అన్ని రకాల విషయాలు చెప్పింది. అయితే అవి చాలా ఇంట్రెస్ట్ కలిగించాయి. తను వేసిన అడుగుల వల్ల తన జీవితం ఏమయ్యేదో అని నాకు అనిపించింది.

ఈ కాలం లో ఉన్న అమ్మాయిలకు తన గురించి తెలియాలని నాకు అనిపించింది. అందుకే తనను అడిగాను నేను నీ కథ రాయవచ్చా అని అడగగానే వెంటనే ఏ మాత్రం ఆలస్యం లేకుండా సరే అక్కా రాయి అంటూ తన అనుమతి తెలిపింది.

ఇది జరిగి ఆరు నెలలు గడిచిపోయినా నాకు రాసే తీరిక లేకపోయింది. ఇప్పుడు అక్షరలిపి వారు తార అనే అంశం ఇవ్వగానే అదంతా గుర్తొచ్చి, తారా చరణియం  రాయడం మొదలు పెట్టాను.

ఇది పరిచయం మాత్రమే ఇక నుండి వారానికి ఒకసారి తారా చరణియం కథ మీ ముందుకు వస్తుంది. వచ్చే గురువారం నుండి మొదలవుతుంది.

నా ఈ కథను ఆదరిస్తారని నమ్ముతూ, మీ విలువైన అభిప్రాయాన్ని, సమీక్షలు అందజేయగలరు అని ఆశిస్తూ ప్రస్తుతానికి సెలవ్.

– భవ్యచారు

0 Replies to “తారా చరణియం పరిచయం”

  1. మనసులోని ఇబ్బందులు ఇతరులతో పంచుకుంటే మనసులో ఉన్న బరువు తగ్గిపోతుంది. మీరు చక్కగా వ్రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *