తారా తోరణం

తారాతోరణం

ప్రసాదుకి సినిమా పిచ్చి. ఒక్కసినిమాలో అయినా నటించేఅవకాశం కోసం ఎదురుచూస్తూఉన్నాడు. సినిమా అవకాశాలుఏవీ ఊరికే రావు కదా. ముందు
టిక్ టాక్లో పోస్టులు పెట్టాడు. తన నటన విశ్వరూపాన్ని చూపే వీడియోలు తీసి అవి
టిక్ టాక్లో పెట్టాడు.

కొందరుఅతన్ని ఫాలో చేయటం మొదలుపెట్టారు. కరెక్టుగాపేరు వస్తుంది అనుకునేసమయానికి టిక్ టాక్ బ్యాన్చేసారు. ఆ తర్వాత యూట్యూబ్లో తన వీడియోలుపెట్టాడు. ఫాలోవర్స్ పెరిగారు,అతని ఛానల్ సక్స్క్రైబ్ చేసుకునే వారు కూడా బాగాపెరిగారు. అయినా అతనికిసినిమాలలో అవకాశం ఏమీ
లభించలేదు.

మితృల సలహాతో షార్ట్ ఫిల్మ్ కూడా తీసాడు. ఆ షార్ట్ ఫిల్ములోతన మితృలే పాత్రదారులు.మొత్తానికి ఫిల్మ్ బాగానే వచ్చింది. ఆ ఫిల్మ్ యూట్యూబ్లో పోస్ట్ చేసాడు.ఆ ఫిల్మ్ కు దర్శకుడు,నిర్మాత ప్రసాదే. చాలామంది ఆడియన్స్ చూసినాపెద్ద డబ్బులు రాలేదు. ఇలాచేతి చమురు వదిలిందికానీ అవకాశాలు రాలేదు.

ప్రసాదు మనసులో కసిపెరిగింది. అన్ని సోషల్ మాధ్యమాల్లో తన వీడియోలు పెట్టాడు. ఇన్స్టాగ్రామ్,ట్విట్టర్వేదికలలో తన నటనా ప్రతిభచూపే వీడియోలు షేర్ చేసాడు. ఇలా చేస్తున్న సమయంలో చదువు పట్లశ్రద్ధ చూపించకపోవటంతోచదువులో వెనకబడ్డాడు.అయినా ప్రసాద్ తన పట్టువీడలేదు. ఫిల్మ్ స్టూడియోలచుట్టూ చక్కర్లు కొట్టడంమొదలుపెట్టాడు.

ఒకేఒకఅవకాశం కోసం అందరుడైరెక్టర్లను కలవటం మొదలుపెట్టాడు. సినీతారా తోరణంలో తాను కూడాఒక తారగా వెలగాలనే అతనిసంకల్పం ముందు ఓటమిఓడిపోయింది. అతనే గెలిచాడు. ఒక ఔత్సాహికదర్శకుడు అతనికి తనయొక్కసినిమాలో అవకాశం ఇచ్చాడు.

సినిమా అవకాశం దొరికింది అని అనుకునేలోపే ఆర్థిక సమస్యల వల్ల ఆ సినిమానిర్మాణం ఆగిపోయింది. ప్రసాద్ఆ సినిమా నిర్మాతను ఒప్పించి తన బంధుమిత్రుల వద్ద డబ్బుతెచ్చి ఆ సినిమా నిర్మాణం పూర్తి చేసాడు.

సినిమా పూర్తిచేసిన ప్రసాదు ఆ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు టెన్షన్ పడుతూనే ఉన్నాడు. మొత్తానికి సినిమా రిలీజైంది.ఆ సినిమా బాక్సాఫీస్ ను
బద్దలు కొట్టింది. కాసుల వర్షంకురిపించింది. బంధుమిత్రులఅప్పులన్నీ తీర్చేసాడు ప్రసాద్.

ఆ సినిమా దర్శకుడికి, హీరోకు,మిగతా నటీనట సాంకేతికవర్గానికి మంచి పేరు వచ్చింది.మొత్తానికి ప్రసాద్ కల నెరవేరింది. సినీ వినీలాకాశంలో
ఉన్న నక్షత్రాల తోటలో తనకూస్ధానం దొరికినందుకు చాలా తృప్తి పడ్డాడు.

ఆ తర్వాతసినిమా అవకాశాలు బాగానేరావటంలో తారా తోరణంలో ఒక తారగా వెలుగులు చిమ్మేతారగా నిలబడిపోయాడుమన ప్రసాద్. నిజంగా చెప్పాలంటే నిరంతర కృషివల్లే ప్రసాద్ ఆ స్ధితిని పొందిమిగతావారికి మార్గదర్శనం అయ్యాడు.

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *