స్వర్గం _నరకం
(ఆటవెలదులు)
1) పల్లె సీమలన్ని పైరుపచ్చల నిండి
స్వచ్ఛమైన గాలి వచ్చుచుండు
అట్టి గాలి పీల్చు టారోగ్య భాగ్యమౌ
చక్కదనపు స్వర్గ మెక్కడుండు?
2)అమ్మ.అక్క.చెల్లి అందాల బంధాలు
పల్లె సీమలందు బహు పసందు
కల్తిలేనిపంట కల్తిలేని మనసు
స్వర్గసీమ కంటె చక్కగుండు
3)నగరవాసమందు నరుని జీవితమ్ము
మేడిపండులాగ మెరయుచుండు
గాలి.నీరు.నిప్పు.గాసాలు కొనవలె
ఉరుకు పరుగు బతుకు ఊరటేది?
4)నగరమందు జనులు నరకమే జూతురు
మురికి కాల్వ కంపు ముక్కు దూరు
నిద్రపట్టకుండ నినుగుట్టు దోమలు
నగరమునకుమించు నరకమే ది?
– కోట