స్వార్థం
“ఒకవైపు ఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలు
ఇంకోవైపు అణగారిన వర్గాల ఆక్రందనలు……
ఈ సృష్టిలో మనిషిగా పుట్టాం అని సంతోషపడే క్షణాల ఎక్కడా…?
ధనవంతులు సంపద కోసం
పేదవాడు ఆకలి కోసం తీసే పరుగులకు నేలసైతం చిన్నదైపోయింది…
లేనివాడి ఆకలి ఏడుపులు వినలేక పుడమి తల్లి బోరుమంటుంది..
ఆది నుంచి నేటి వరకు మిగిలిన ప్రాణులన్నీ
బలమైనవర్గాల చక్రాల కింద పడి నలిగే ప్రాణాలెన్ని..
అభివృద్ది అంటూ ఆరులు తీస్తూ, అవసరాలకి అడ్డదారులు…
అయినవాళ్ళు లేరు,
కానీ వాళ్లు లేరు ఉన్నదొకటే స్వార్థం…!
డబ్బుతో సావాసం, సంపదకై పోరాటం..
కలిమి లేదు, చెలిమి లేదు
కాలంతో ప్రయాణం..
ముసుగుతో మాట్లాడే మనుషులు
ఈరోజొకటి రేపోకటి…
మన బ్రతుకు చాలు ఎవడెం అయితే నాకేంటి..
అన్ని ఉన్నా ఎదో దానికై ఆరాటం…
మంచి లేదు, మానవత్వం లేదు రంగులు మార్చుకుంటూ పోదాం…
ఎక్కడున్నామ్ మనం, ఎటు పోతున్నాం మనం”…??
– కుమార్ రాజా