స్వార్థ రాజకీయం
హర్ష టెన్షన్ పడుతున్నాడు.అసలు ఏమి జరిగింది అంటేహర్ష ఒక అధికార రాజకీయ పార్టీ నాయకుడు. ఆ పార్టీరాష్ట్రంలో అధికారంలో ఉంది.తన పార్టీ అధికారంలో ఉన్నాకూడా ఒక పదవి కూడా పొందలేకపోయాడు హర్ష.
కనీసంనామినేటెడ్ పదవులు కూడాపొందలేకపోయాడు. ఏ పదవిపొందాలన్నా డబ్బులు ఖర్చుపెట్టాలని అతనికి తెలుసు కానీఅంత డబ్బు ఖర్చుపెట్టే తాహతు అతనికి లేదు.
కుర్రాడు కాబట్టి ఏదో ఉత్సాహంగా రాజకీయరంగంలోకి అడుగుపెట్టాడు. కానీ నిజానికి అతనికి ధనబలం లేదు. ఈ రోజులు డబ్బులు ఖర్చుపెట్టకుండారాజకీయాలు చేయాలంటేకుదిరే పని కాదు.
అతనిఉత్సాహం చూసి ప్రతిపక్షపార్టీ అతనికి ఎమ్మెల్యే సీటుఇవ్వటానికి సిద్ధపడింది. ఇటుచూస్తే అతనుండే అధికారపార్టీఅతనికిఎమ్మెల్యే సీటు ఇచ్చేఅవకాశం లేదు.
రాజకీయంగాఎదగాలి అంటే అతను ఏదోపార్టీ నుంచి పోటీ చేయాలి.ఈసారి ప్రతిపక్షంలో ఉన్నపార్టీ అధికారంలోకి వచ్చేఅవకాశం ఉంది.
అందుకేఅధికార పార్టీ సభ్యత్వానికిరాజీనామా చేసి ప్రతిపక్షంలోచేరాడు. వారు అతనికి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకుటికెట్ ఇచ్చారు.
అంతా బాగానేఉంది కానీ హర్ష వద్ద డబ్బు లేదు. ఎలక్షన్లో పోటీ చేయాలిఅంటే డబ్బులు కావాలి కదా.అతని పార్టీ రాజకీయ నాయకుడు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టవద్దని ఖచ్చితంగా చెప్పాడు.
విలువలతో కూడినరాజకీయాలు చేయాలని అతని ఉద్దేశ్యం. హర్ష అందుకేటెన్షన్ పడుతున్నాడు. గెలిస్తేప్రజలకు సేవ చేయాలని అతనిసంకల్పం.
ప్రజలు అతన్ని గెలిపిస్తారా, లేదా అనే ప్రశ్నకుకాలమే సమాధానం చెప్పాలి.స్వార్థ రాజకీయాలు పోవాలిఅంటే ఇలాంటి యువతను గెలిపించాలి.
-వెంకట భానుప్రసాద్ చలసాని