స్వప్నవేణువు

స్వప్నవేణువు

నైఋతి అప్పుడే అలుముకుంది
నేల అప్పు తీర్చేయటానికి!
బాకీలు పంచభూతాలకూ ఉన్నట్టున్నాయి

తడితపనలతో విప్పారే నేల
వెన్నెల్లో తడిసిన వృక్షంలా హొయలు పోతుంటుంది

వర్షర్తువు తోసుకొచ్చిందంటే
ఊరంతా సంక్రాంతేకదా
మండుతున్న ఎండలు
గుండె లయను లయతప్పేలా చేస్తుంటే
స్వప్నవేణువూదుతుంటాను

 

-సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *