స్వప్న కల

స్వప్నకల

 

వికాస్ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు..వాళ్ల బంధువుల్లో ఎవరూ కూడా అంత సంపాదనలో లేరు దాంతో వికాస్ కి సంబంధాలు బోలెడు రాసాగాయి..దగ్గరి వాళ్లే మేమిస్తామంటె మేమిస్తామంటూ ఎగబడుతున్నారు..
ఏంటను కుంటున్నారు? పిల్లను..వికాస్ కేమెా సెలక్షన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది జాబ్ అయినా అంత ఈజీగా సంపాదించాడు కానీ ఈ పిల్లను సెలక్టు చేసుకోవడానికితల మునకలవుతున్నాడు..చివరకు వడబోయగా పోయగా స్వప్న నచ్చింది..
స్వప్న అంటేనె కల కదా!ఆమె ఎప్పుడూ కలలు కంటూనె ఉంటుంది..ఏ ముహూర్తాన పెట్టారో! ఆమెకా పేరు కానీ కలలే కలలు..ఆమె తల్లి తండ్రులకు ముందే తెలుసా? ఏంటి? అనేలానె ఉంటాయామె కలలు..ఎలా అయితే ఏంటి? ఆమె కలగన్న వరుడే దొరికాడుఅందగాడు సంపాదన పరుడు..
ఇక ఆమె ఆనందానికి హద్దే లేదు..

ఆమెను పెళ్లి చేసుకున్న దగ్గరి నుంచి పాపం వికాస్ కష్టాలు చెప్పతరం కాదు..ఎందుకంటె?ఈ వారంలో కల కంటుందా ఆ వీకెండులో నెర వేర్చాల్సిందే!
ఈ వారం పెద్ద రెస్టారెంట్ కు వెళ్లినట్టు కలగంటుందివీకెండ్ అలాంటి రెస్టారెంట్ వెతికి మరీ వెళ్లాల్సిందే!పెళ్లయిన కొత్తలో కొత్త కదాని సరి పెట్టుకున్నాడు కానీ
పదేళ్లు గడిచినా అదే తంతు..

మెున్నేమెా! పది తులాల కాసుల పేరు కొన్నట్టు కల కన్నదట..వికాస్ డబ్బులు ఊరికే రావు అన్నాడట..అంతే!పెద్ద గొడవ దాంతో వికాస్ కొనక తప్పలేదట..
మళ్లీ వారం ఇండిపెండెంట్ హౌస్ కొన్నట్టు కలట..చచ్చినట్టు లోన్ పెట్టి కొన్నాడట..ఆయనకు వచ్చే రెండు లక్షలు రెండు వేలతో సమానం
అవుతున్నాయట..

ఇంకా పెద్ద ఉధ్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు మనవికాస్..స్వప్న ఇంకా ఏం కల గంటుందోనని భయపడి ఛస్తున్నాడు వికాస్..వచ్చే జీతం ఇంతేనె అని ఎంత మెుత్తుకున్నా వినదే!ఆ కలల రాణి…

ఇది నవ్వుకుంటారని రాసిన..
నవ్వు వస్తుందా? వస్తే నవ్వుకోండ్రి ..నవ్వు వచ్చిందో?
లేదో? నాకైతే చెప్పుకోండ్రి..

 

-ఉమాదేవి ఎర్రం..

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *