స్వార్ధపరుడు
తల్లికి బిడ్డ పై స్వార్థం ఉంటుంది
ఆలుకి భర్త పై స్వార్థం ఉంటుంది
ప్రేమికుడికి ప్రియురాలి పై స్వార్థం ఉంటుంది
అలాగే ప్రేయసి కి ప్రియుడిపై స్వార్థం ఉంటుంది
స్వార్థం లేనిది ఎవరు
ఒక్క దేవుడు తప్ప
సృష్టిలో అందరూ స్వార్థపరులే
స్వార్థం పెను వేసుకుంటే నష్టమేమి
ఒక్కొక్కప్పుడు అది కూడా ప్రేమే గానే మారుతుంది
అది మరీ ఎక్కువైతే ద్వేషంగా మారుతుంది
ద్వేషం కుళ్ళుగా మారుతుంది
ఆవు దూడకి పాలిస్తుంది
స్వార్థమే ఎరగదు
చెట్టు గాలిస్తుంది నీడ నిస్స్తుంది పాలిస్తుంది
చెట్లు లేకపోతే మనుగడే దుర్లభం
అవును చూసి నేర్చుకో ప్రేమించడం నేర్చుకో
చెట్టును చూసి నేర్చుకో
మానవతకు అర్థం మలుచుకో
స్వార్థం లేని జీవులు కంటే
స్వార్థం ఉన్న జీవులు కన్నతల్లి
బిడ్డల్ని పెంచుతుంది
అష్ట కష్టాలు పడుతుంది
మానవతతో చూస్తుంది
భర్త పెట్టిన కష్టాలను విడుతుంది
బిడ్డను ప్రేమించి పెంచుతుంది
సృష్టిలో స్వార్థం కూడా కొన్నిసార్లు మంచినే చేస్తాయి
మరచిపోకు మిత్రమా
– యడ్ల శ్రీనివాసరావు