సస్పెన్స్
మనిషి పుట్టుకే ఒక సస్పెన్స్.
మరణం కూడా ఒక సస్పెన్స్.
దేవుడు ఉన్నాడనేది సస్పెన్స్.
రేపు ఏమౌతుందో తెలియదు.
అది కూడా సూపర్ సస్పెన్స్.
సస్పెన్స్ లేని జీవితమే లేదు.
ఊరికే భయపడకు మిత్రమా.
ఏది జరిగినా మన మంచికే.
అలా అనుకోకపోతే టెన్షన్.
అలా అనుకుంటే మనశ్శాంతి.
ఎప్పుడేమి జరుగుతుందో
తెలియని ప్రపంచం ఇది.
సస్పెన్స్ తమ్ముడే టెన్షన్.
మనశ్శాంతి శతృవు సస్పెన్స్.
-వెంకట భానుప్రసాద్ చలసాని
జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఆ మాట నిజమే.