సురభి

సురభి

సురభి ఎప్పుడు లాగే ఆఫీస్ కి బయలుదేరింది.  ఆఫీసులో వర్క్ కంప్లీట్ చేసుకుని సాయంత్రం బయలుదేరుతుండగా వర్షం మొదలైంది.ఇంకేం చేయలేక అక్కడే ఆఫీసులోనే ఉంది సురభి.  సురభి అంటే హర్ష కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. హర్ష వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు.

“సురభి నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను” అని చెప్పాడు హర్ష.”అది… సార్… వర్షం తగ్గాక నేను ఇంటికి వెళ్తాను” అని చెప్పింది సురభి.”నో… నో ప్రాబ్లం లేదు. నేను నిన్ను ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను రా” అని చెప్పాడు హర్ష.

హర్ష మాట కాదనలేక వెళ్లి కారులో కూర్చుని సురభి.హర్ష ఇద్దరు ఫ్రెండ్స్ సురభి ,హర్ష కార్ డ్రైవ్ చేస్తున్నాడు.”ఏంటి కమల ఇంకా సురభి ఆఫీస్ నుంచి రాలేదా?” అని అడిగాడు మూర్తి.
“ఇంకా లేదండి ఫోన్ చేస్తే వస్తున్న అని చెప్పింది” అని చెప్పింది కమల.

“సరే నువ్వు కంగారు పడకుండా వచ్చి సోఫాలో కూర్చో” అని చెప్పాడు మూర్తి.”అది కాదండి… బయట పరిస్థితి ఏం బాలేదు అందుకే నేను కంగారు పడుతున్నాను” అని చెప్పింది కమల.”నువ్వు ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్పింది కదా మరి ఎందుకు కంగారు పడడం చెప్పు” అని అడిగాడు మూర్తి.
“అలాగే…” అని చెప్పి సోఫాలో కూర్చుంది కమల.

హర్ష కి కాల్ వచ్చి లిఫ్ట్ చేస్తే”హలో… అన్నయ్య ఒకసారి ఇంటికి వస్తావా?” అన్నయ్య అని అడిగింది కీర్తన.”ఏమైంది కీర్తన… ఏదైనా సమస్య?” అని అడిగాడు హర్ష.
“అది ఫోన్ లో చెప్పేది కాదన్నయ్య ఒకసారి ఇంటికి వస్తే చెప్తాను” అని చెప్పింది కీర్తన.

“సరే… ఒక గంటలో వస్తాను” అని చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష.హర్ష ఫ్రెండ్స్ వెనక సీట్లు కూర్చొని హర్ష కి కనపడకుండా బీర్ తాగుతున్నారు.సురభి కి అనుమానం వచ్చిన హర్ష కి చెప్పలేదు. తాను ఇంకా భయపడుతుంది.

‘ఈరోజు నేను అసలు ఇంటికి వెళ్తానా , అసలే వెనక సీట్లు ఉన్న వాళ్ళు పోరంబోకు లాగా ఉన్నారు. వీళ్లేంటి సార్ కి ఫ్రెండ్స్ అంట. సార్ కి లాంటి వాళ్లతో స్నేహం ఏంటో? తన మనసులో అనుకుంది సురభి.’

ఐదు నిమిషాల్లో సురభి వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేసేసి సురభి థ్యాంక్స్ చెప్పేలోపు హర్ష వెళ్ళిపోయాడు.సురభి గేట్ తీసుకొని లోపలికి వస్తుండగా కమల ఎదురు వచ్చి “గంటకు ముందు వస్తున్న అన్నావ్ ఇంతసేపు ఏంటే ?”అని అడిగింది.

“అబ్బా… తను వచ్చేసింది కదా ఇంక తన బుర్రెందుకు తింటావ్. పద అన్నం తిందాం” అని చెప్పాడు మూర్తి.సురభి రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది.అందరూ కలిసి భోజనం చేశారు.

“ఏంట్రా కారులో అమ్మాయి ఉంది అని కూడా తెలిసి కూడా మీరు తాగుతున్నారు. మీకు అసలు బుద్ధి లేదా? సరే నేను కీర్తన వాళ్ళ ఇంటికి వెళ్తాను మీరు కార్ తీసుకొని ఇంటికి వెళ్ళండి”అని కోప్పడ్డాడు హర్ష.

నిర్మానుష్య దారులో ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తుంది. ఆ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఆ అమ్మాయి భయం భయంగా బిక్కుబిక్కుమంటూ ఆ రోడ్డుపైన వెళుతుంది.
ఆ అమ్మాయి ఎందుకో కొంచెం కంగారు కూడా ఉంది. హర్ష ఫ్రెండ్స్ అటువైపు వస్తుండగా ఆ అమ్మాయిని చూసి వాళ్ల మనసులో దుర్బుద్ధి పుట్టింది.

ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తామంటూ కార్ ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్ళాక దారి తప్పించి ఒక పాడుబడ్డ బంగ్లా కి తీసుకెళ్లారు.ఆ అమ్మాయిని వారం రోజులు చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసి చంపేశారు. ఆమె శవాన్ని తీసుకెళ్లి ఒక చెరువులో పారేశారు.

ఆ చెరువులో చేపలు పడడానికి వచ్చిన వాళ్ళకి ఆ అమ్మాయి శవం కనిపించింది. వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.ఈ అమ్మాయి పేరు నతాషా అని గుర్తించారు. ఈ కేస్ మీద ఎంక్వయిరీ చేస్తున్నామని కూడా చెప్పారు.

టీవీలో నతాషా ఫోటో చూసి సురభి కొంచెం షాక్ అయింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి విషయం కనుక్కుంది సురభి.పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ కోసం వెతుకుతున్నారు.

ఒక దగ్గర ఒక కారు కనిపించింది ఆ కారులో నతాషా ఎక్కినట్టు కనిపించింది. ఆ కార్ నెంబర్ కూడా సిసి ఫుటేజ్ లో రికార్డు అయింది.

ఆ కారు హర్ష పేరు మీద ఉండడం వల్ల హర్ష ని పిలిచి ఎంక్వయిరీ చేస్తున్నారు పోలీసులు.పోలీస్ ఎంక్వైరీ లో హర్ష తనతో ఆ రోజు ఇద్దరి ఫ్రెండ్స్ ఉన్నారని తన కారులో వెళ్ళింది తన ఇద్దరు ఫ్రెండ్స్ తాను తన చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్లానని చెప్పాడు హర్ష.

హర్ష వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది.సురభి కి కూడా వాళ్ళిద్దరి మీదే డౌట్ వచ్చింది.నతాషా కి జరిగిన అన్యాయానికి తాను మరో సాక్షిగా కోర్టుకు వచ్చి నిజం చెప్పాలి అని పోలీసులు చెప్పారు సురభికి.

“సాక్ష్యం చెప్పడానికి నువ్వు  కోర్టుకి వెళ్లడానికి వీల్లేదు. రేపు నీ పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది” అని భయంతో కమల చెప్పింది.”అదేంటమ్మా నాలాంటి ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి సాక్ష్యం చెప్పడానికి వెళ్లొద్దు అని అంటావేంటి? రేపు నాకే జరిగితే సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు రారు” అని నిలదీసింది సురభి.

“నువ్వు ఎన్ని చెప్పినా మేము మారం నువ్వు వెళ్లడానికి వీల్లేదు” అని తెగేసి చెప్పాడు మూర్తి.రెండు రోజుల తర్వాత కోర్టుకు వెళ్లాలి. వీళ్ళమో నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్తే  ఊరుకోము అంటున్నారు ఇప్పుడు ఎలా?’ అని ఆలోచిస్తుంది సురభి.హర్ష సురభి వాళ్ళకి ఇంటికి వచ్చాడు.

“హర్ష ఎంత చెప్పినా సురభి వాళ్ళ అమ్మ నాన్న వినలేదు.నేను ప్రేమించిన అమ్మాయిని సాక్ష్యంగా కోర్టుకి తీసుకు వెళుతున్నాను. అడగడానికి మీరు ఎవరు?” అని చెప్పి రూమ్ లో ఉన్న సురభి తీసుకొని వెళ్ళిపోయాడు.

సురభి కోర్టులో సాక్ష్యం చెప్పి వాళ్ళిద్దరికీ శిక్ష పడేలా చేసింది.నతషా ఆత్మకి ఇప్పుడు శాంతి కలుగుతుంది. తర్వాత కమల , మూర్తి లను ఒప్పించి హర్ష సురభిని పెళ్లి చేసుకున్నాడు.
“సురభి నాకు నీలో నీ ధైర్యం నచ్చి నిన్ను ఇష్టపడ్డాను” అని చెప్పాడు హర్ష.

నువ్వే నా ధైర్యం హర్ష అని చెప్పింది సురభి.ఇలా వాళ్ళు ఆనందంగా జీవితం గడుపుతుంటేకమల , మూర్తి చూసి మనకి ఈ ఆనందం చాలు అని అనుకున్నారు..

 

 

-మాధవి కాళ్ల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *