స్త్రీ శక్తి
స్త్రీ ఒక అద్భుతం…
స్త్రీ శరీరం ఎంతో సుకుమారం కానీ మానసికంగా ఎంతో దృఢత్వం..
ఒక స్త్రీ కి ఉన్న ఓపిక మరెవరికి ఉండదు…
నెల నెల తన బిడ్డ కడుపులో బరువు పెరుగుతున్నా సంతోషంగా భరిస్తూ తరం ఇస్తుంది..
స్త్రీకి తన భర్త లేకపోయినా తన పిల్లలకు ఎంత కష్టమైనా సరే పోషించి ఉన్నంతలో ఏ లోటు లేకుండా చూసుకోగలదు..
ఏమి తేలినట్లే ఉంటుంది కానీ సమయం వచ్చినపుడు తానే రాజు తానే మంత్రి తానే సేవకురాలు.. తన మనసు ఓ ఆలోచన నిధి బండాఘరాం.. బయట పడని ఓ సముద్ర గోష.. ఎప్పటికి అర్ధం కానీ ఓ మహా కావ్యం ఈ స్త్రీ..
కానీ స్త్రీ కి మనము ఇచ్చే విలువ ఏంటో తెలుసా నీకేం తెలుసు నువ్వు మౌనంగా ఉండు అనే బహుమానం …
ఒక్కసారి స్త్రీ తెగించి ముందుకు వస్తే ఆ శక్తి ముందు నిలవలేదు మరే శక్తి…
– కళ
అద్భుతం కళ 💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌