స్త్రీ
వంటి మీద నిండైన బట్ట బరువు…
కడుపులో శిశువు బరువు
మెడమీద తాళి బరువు
ఋతుకాలపు సంవేదనలు.
మాననీయ మైన స్త్రీ
అంతరంగం ఎరుగరు…
అనురాగం…అనురక్తి మార్థవం…మమకారం…కరుణ…జాలి…దయ…శరణాగతి…భక్తి….శౌర్యం..సాహాసం..ధైర్యం…అంకిత భావం…
ఇవన్నీ స్త్రీ అనే పుష్పపు పరిమళ మకంరందాలు.
తను గానం లో విపంచి
నర్తన లో ఊర్వశి
నటనలో మోహిని
మోహన కేళి లో సురనర్తకి రంబ
కార్య ధీక్షలో దాక్షాయిని
సిరి లో మహాలక్ష్మి
చదువు లో గాయత్రి
కోపంలో కాళి..
శిక్షణ లో శింఖండి
చల్లదనం లో చాయ
రణం లో సత్యాదేవి
సుగుణం లో సీతమ్మ..
పట్టుదలలో వేదవతి
అన్ని వెరసి ప్రేమలో అమ్మ
ఇన్ని గుణాల ఉన్న ఆడవారు ఎప్పటికి గొప్పవారే..
-గురువర్ధన్ రెడ్డి